Malla Reddy DJ Tillu Song: తనదైన పాజిటివ్ ఆటిట్యూడ్, చలాకీతనంతో ఎప్పుడూ వార్తల్లో ట్రెండింగ్‌గా నిలిచే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి.. మరో వైరల్ పాటతో యువతలో హుషారు నింపారు. పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడ్డా.. అనే మల్లారెడ్డి డైలాగ్ గుర్తొస్తే ఇప్పటికీ నవ్వులతో పాటు ఆయన కష్టం కళ్ల ముందు కనపడుతుంది. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వ్యవస్థాపకుడైనా ఆ గర్వం కూసింతైనా కనపడదు. తాజాగా డీజే టిల్లు పాటకు దుమ్ము రేపే స్టెప్స్ వేసి అదరగొట్టారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
Also Read: https://teluguprabha.net/viral/young-man-helped-pregnant-woman-deliver-in-mumbai-local-train/
రాజకీయాలకతీతంగా అందరికీ నచ్చే వ్యక్తి ఎమ్మెల్యే మల్లారెడ్డి. తాజాగా మైసమ్మగూడలోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ భాగస్వామ్యంతో డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఉత్సాహాన్ని అందిస్తూ వారితో కలిసి మల్లారెడ్డి డీజే టిల్లు పాటకు డాన్స్ వేశారు. అచ్చంగా డీజే టిల్లు సాంగ్ స్టెప్పులతో హుషారుగా డాన్స్ వేసి యువతలో జోష్ నింపారు. ఈ సందర్భంగా విద్యార్థులు కెరీర్‌లో ఉన్నత స్థానాల్లో ఎదిగేందుకు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.


