MLA Mallareddy in Rangoli Competition: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాల సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ అంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది రంగురంగులు ముగ్గులు, గొబ్బెమ్మలు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రకరకాల రంగవల్లులతో వీధులన్నీ ముచ్చట గొలిపేలా ఉండే ముగ్గులతో మొదలయ్యే సంక్రాంతి సందడి కోసం అతివలు ఎంతగానో ఎదురుచూస్తారు. తాజాగా తెలంగాణలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
తెలంగాణలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లోని కేఎల్‌ఆర్ ప్రాంతంలో బీఆర్‌ఎస్ అకిటి నవీన్ రెడ్డి నేతృత్వంలో మహిళల కోసం రంగోలి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరై తనదైన రీతిలో అక్కడి వాతావరణంలో జోష్ నింపారు.
పోటీలో పాల్గొన్న మహిళలను ఉత్సాహపరిచేందుకు తానూ స్వయంగా ముగ్గు వేసి రంగులు నింపి ఔరా అనిపించారు. సాధారణంగా ఏ కార్యక్రమానికి వెళ్లినా.. తనదైన స్టైల్‌లో పంచ్ డైలాగ్‌లతో అందర్నీ కడుపుబ్బా నవ్వించే మల్లారెడ్డి.. మహిళలకు సంబంధించిన ఈ కార్యక్రమంలోనూ తనదైన రీతిలో ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు. ఎమ్మెల్యే ముగ్గు వేయడం చూసి మహిళలు సంతోషంతో కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడారు.
As part of the Sankranti celebrations, rangoli (Muggu) competitions were organized in the KLR area of the Pudur–Kishtapur division under the leadership of BRS leader Akiti Naveen Reddy. Medchal MLA Malla Reddy attended the event and added to the festive spirit with his lively… pic.twitter.com/c1ra4ZJoKL
— Hyderabad DNA (@HyderabadDna) January 10, 2026
సంక్రాంతి సంబరాల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామం లో ఘట్కేసర్, మేడ్చల్,నాగారం మున్సిపాలిటీ లలో brs పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలిచిన మహిళామణులకు బహుమతులు అందజేయడం జరిగింది. pic.twitter.com/KS6sz6EuBU
— Chamakura Malla Reddy (@chmallareddyMLA) January 10, 2026
సంక్రాంతి పండుగ తెలుగువారి సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీక అని మల్లారెడ్డి పేర్కొన్నారు. ముగ్గుల పోటీలతో మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీయవచ్చన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అకిటి నవీన్ రెడ్డిని అభినందించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేసి వారితో కలిసి ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

