Saturday, November 15, 2025
Homeవైరల్Montha Cyclone: మొంథా తుపాను.. ఆ పేరు ఎలా వచ్చింది.. అసలు ఈ పేర్లు ఎలా...

Montha Cyclone: మొంథా తుపాను.. ఆ పేరు ఎలా వచ్చింది.. అసలు ఈ పేర్లు ఎలా పెడతారంటే.?

Montha Cyclone Story Behind the Name: తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజా రవాణాతో పాటు జనజీవనం స్తంభించిపోయింది. అయితే గత ఐదేళ్లలో హుద్‌-హుద్‌, జావద్‌, అసాని, మాండస్‌, ఫెంగల్‌.. తాజాగా మొంథా ఇలా చాలా తుపాన్లు సంభవించాయి. అయితే వీటికి ఈ పేర్లు ఎలా పెడతారు.. అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా.. తుపాన్లకు పేర్లు ఎలా పెడతారో ఈ కథనంలో చూద్దాం..

- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడే అల్ప పీడనం, తీవ్ర వాయుగుండం ప్రభావంతో బలమైన గాలులు తీరం వైపు వందల కిలో మీటర్ల వేగంతో దూసుకువస్తాయి. 150 కి.మీ వేగంతో ఓ వాహనం రోడ్డుపైకి దూసుకువస్తే ఆ స్పీడ్‌ ఎంత భయంకరంగా ఉంటుందో.. అలాంటి భయంకరమైన వేగంతో గాలులు వీచి భారీ వర్షాలు సంభవించడం చూస్తున్నాం. భారీ వృక్షాలు నేలకూలడంతో పాటు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి భయానక వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ పెను విధ్వంసాన్ని సృష్టించే తుపానుకు ఈ రకరకాల పేర్లు ఎలా పెడతారంటే.. 

Also Read: https://teluguprabha.net/crime-news/up-man-murders-sister-over-rs-5-lakh-money-dispute-dumps-body-70-km-away/

భూమి చుట్టూ తిరిగే శాటిలైట్ల సాయంతో సముద్రంలో ఏదైనా తీవ్ర వాయుగుండం లేదా అల్పపీడనం సంభవించడం పరిశీలించినట్లయితే మెట్రాలజీ అధికారులు దానిని ట్రాక్‌ చేస్తారు. అల్పపీడనం బలపడినట్లయితే ఐదు రోజులు ముందుగానే ప్రజలను అప్రమత్తం చేస్తారు. అయితే భారత్‌ చుట్టూ విస్తరించి ఉన్న హిందూ మహాసముద్రం, అరేబియన్‌ మహా సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సందర్భాల్లో వీటిని తుపానులుగా పిలుస్తారు. ప్రాంతీయ కేంద్రాలు, వాటి పరిధి, తుపానులకు పేర్లు పెట్టడం వంటి పర్యవేక్షణ కార్యకలాపాల కోసం ప్రపంచాన్ని ఆరు ప్రధాన బేసిన్‌లుగా విభజించడం జరిగింది. ప్రతి బేసిన్‌కు RSMC అంటే ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం నిర్ణయిస్తారు. ఆయా కేంద్రాలు తమ పరిధిలోని దేశాల జాబితాల నుంచి పేర్లను ఎంపిక చేసుకుంటాయి. సైక్లోన్ వస్తే ఉత్తర హిందూ మహా సముద్రం, బంగాళా ఖాతం, అరేబియా సముద్ర ప్రాంతాలకు తుపానుకు పేరు పెట్టడానికి ఆర్.ఎస్.ఎం.సి న్యూఢిల్లీ సమన్వయ బాధ్యతలు తీసుకుంటుంది.

Also Read: https://teluguprabha.net/viral/bengaluru-cfo-bribes-daughter-death-akshaya-viral-post-police-suspension-oct-2025-bengaluru-cfo-bribes/

ప్రస్తుతం న్యూ ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఆర్.ఎస్.ఎం.సిలో 13(భారతదేశం, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), యెమెన్) భాగస్వామ్య దేశాలు. ప్రస్తుతం మొంథా తుపాను పేరును ఈ కేంద్రంలో భాగమైన థాయ్‌లాండ్ దేశం సూచించగా.. మొంథా అంటే థాయ్ భాషలో సువాసన గల పువ్వు లేదా అందమైన పువ్వు అని అర్థం వస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad