Sunday, November 16, 2025
Homeవైరల్Viral Video: బరువెక్కిన గుండెతో కొడుకును బార్డర్‌కు పంపిన తల్లి.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Viral Video: బరువెక్కిన గుండెతో కొడుకును బార్డర్‌కు పంపిన తల్లి.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Mother sends son off to serve country video viral in social media: దేశ రక్షణ కోసం కుటుంబాన్ని మాత్రమే కాదు.. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అహర్నిషలు శ్రమించే సైనికుల త్యాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు బార్డర్‌లో ఎండా, వాన లెక్క చేయకుండా గస్తీ కాస్తుండటంతోనే ఇక్కడ మనమంతా ప్రశాంతంగా పని చేసుకోగలుగుతున్నాం. స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. మనలాగే అలాంటి సైనికులకు సైతం కుటుంబాలు ఉంటాయి.. భావోద్వేగాలు ఉంటాయి. మళ్లీ తిరిగి వస్తాడో రాడో అనే భయంతో సైనికుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వేదన వర్ణణాతీతం. తమ బిడ్డ తిరిగి వచ్చేవరకు బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. మరోవైపు, తమ బిడ్డ దేశానికి చేస్తున్న సేవను గుర్తు చేసుకుంటూ ఉప్పొంగిపోతారు. తాజాగా, ఓ సైనికుడికి సంబంధించిన ఒక భావోద్వేగ వీడియో వైరల్ అయింది. ఓ జవాన్‌ తమ ఇళ్లు విడిచి బార్డర్‌కు వెళ్లే క్షణం అందరి కళ్లలో కన్నీరు తెప్పిస్తుంది. ఈ వీడియోలో దేశ సేవ కోసం బయలుదేరిన తన కొడుక్కి తన తల్లి వీడ్కోలు పలకడం.. చూపరులను కన్నీరు పెట్టిస్తుంది. తల్లి తన కొడుకు నుదిటిపై ముద్దు పెట్టుకుని దేశానికి సేవ చేయడానికి సాగనంపింది. బరువెక్కిన గుండెతో తన కొడుకును బార్డర్‌కు పంపింది. ఈ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/aarogyasri-treatment-services-to-be-closed-from-midnight/

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌..

ఇట్క్స్-షిరామ్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయబడిన ఈ వీడియోలో ఓ తల్లి తన కొడుకును బార్డర్‌కు పంపించేందుకు బస్ స్టాండ్‌కు వచ్చింది. ఈ సమయంలో తల్లి భావోద్వేగానికి గురై తన కొడుకు బుగ్గమీద, నుదిటిపై ముద్దు పెట్టుకుంది. అనంతరం తన ప్రియమైన కొడుకుకు కరచాలనం చేసి వీడ్కోలు పలికింది. ఈ వీడియోలో సదరు ఆర్మీ జవాన్ తండ్రి, కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు. అక్కడ ఉన్నవారు ఈ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాలలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షా నలభై వేల మందికి పైగా వీక్షించి.. సదరు ఆర్మీ జవాన్‌కు సెల్యూట్‌ చేస్తున్నారు. ఈ భావోద్వేగ వీడ్కోలు క్షణాన్ని చూస్తుంటే తమ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. తమ బిడ్డను దేశ సేవకై బార్డర్‌కు పంపుతున్న తల్లిదండ్రుల త్యాగాన్ని కొనియాడుతున్నారు. కాగా, ఈ భావోద్వేగ క్షణాన్ని మొబైల్‌లో బంధించిన ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌కు నెటిజన్లు థాంక్స్ చెబుతున్నారు. ఈ వీడియో కింద “దేశ రక్షణ కోసం తన బిడ్డను బార్డర్‌కు పంపుతున్న తల్లికి వందనాలు, నమస్తే అమ్మ” అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. అమ్మా.. నువ్వు నిజంగా గ్రేట్.. నీ కొడుకు సరిహద్దులో నిలబడి దేశాన్ని కాపాడుతూ గర్వకారణమైన పని చేస్తున్నాడు” అని మరొకరు కామెంట్ చేయగా.. కొందరు హార్ట్ సింబల్‌ని పంపించి తమ ప్రశంసలను వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad