Saturday, November 15, 2025
Homeవైరల్Viral Video: అభిమానికి ‘మిస్టర్‌ కూల్‌’ ఆటోగ్రాఫ్‌.. ధోనీ రియాక్షన్‌ వీడియో వైరల్‌ 

Viral Video: అభిమానికి ‘మిస్టర్‌ కూల్‌’ ఆటోగ్రాఫ్‌.. ధోనీ రియాక్షన్‌ వీడియో వైరల్‌ 

MS Dhoni Autograph to Fan Video: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ.. ఈ పేరు క్రికెట్‌ చరిత్రలో ఓ సంచలనం. గెలుపు, ఓటమి అనే తేడా లేకుండా అన్ని సందర్భాల్లో ప్రశాంతంగా ఉండే మిస్టర్‌ కూల్‌.. భావితరాల ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకం. ఇక ధోనీ ఎప్పుడైనా పబ్లిక్‌లో కనిపించాడంటే ఫ్యాన్స్‌కి పండగే. ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు అంటూ చుట్టుముడుతుంటారు. అయినా కూడా ఎంతో ఓపికగా అభిమానులను పలకరిస్తూ ఆప్యాయంగా ఉంటాడు. ఇప్పుడు అలాంటి ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/viral/kavala-pillala-baavi-in-patha-doddikunta-village-couples-rush/

తన ఆటతీరుతో పాటు సింప్లిసిటీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న ధోనీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ధోనీకి సంబంధించిన ఏ చిన్న వీడియోనైనా సరే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తాజాగా, ఓ అభిమాని ధోనీని త‌న బైక్‌పై ఆటోగ్రాఫ్‌ అడిగాడు. వెంటనే స్పందించిన మిస్ట‌ర్ కూల్ బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై త‌న సంత‌కం చేశాడు. అనంతరం తన చేతిపై కూడా సంత‌కం చేయాల‌ని అభిమాని విజ్ఞప్తి చేశాడు. ఎక్కడ సైన్‌ చేయాలని అడగడంతో.. ‘ఎలా అయినా పర్లేదు సర్.. సైన్ చేయండి చాలు’ అని ఫ్యాన్‌ కోరాడు. 

Also Read: https://teluguprabha.net/viral/russia-mi-8-helicopter-crash-dagestan-video/

ఇందుకు ధోనీ.. ‘నీకు ఎలా కావాలో చెప్పు. అలా చేస్తా’ అంటూ ఎంతో కూల్‌గా స్పందించగా.. అభిమాని కోరిక మేర‌కు అత‌డి అరచేతి వెనుకవైపు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవ‌ధులు లేవు. ఇక ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ ఫ్యాన్‌ తన బైక్‌పై ‘7’ అని ముద్రించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ‘నువ్వు చాలా లక్కీ’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad