Ganesh Chaturthi: వినాయక చవితి వేడుకలంటేనే గణేశుడికి ఇష్టమైన మోదక్ అందరికీ గుర్తొస్తుంది. కాగా.. ఈసారి గణేశ్ చతుర్థి సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ స్వీట్ షాపు యజమాని బంగారు ఉండ్రాళ్లు విక్రయానికి పెట్టారు. నాసిక్ లోని సాగర్ స్వీట్స్ ఈ ప్రత్యేకమైన ఉండ్రాళ్లను తయారు చేసింది. ఈ మోదక్ ల తయారీలో పసిడి ఉండ్రాళ్లను వాడారు. కాగా.. ఈ ఉండ్రాళ్లను కిలో రూ.20 వేల ధరకు అమ్ముతున్నారు. కాగా.. ఈ గోల్డెన్ మోదక్ కు సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా.. ఈ వీడియోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘వీటిని తినాలా?.. లాకర్‌లో దాచుకోవాలా?’ అని ఒకరు ప్రశ్నించారు. గోల్డెన్ సమోసా,గోల్డెన్ పానీపూరీలు కూడా తయారు చేస్తారా అని మరొకరు ప్రశ్నించారు. దేవుడి పేరుపైన మరో స్కామ్ అని మరొకరు రాసుకొచ్చారు. మనల్ని సృష్టించే భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలమని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Read Also: Jio Offers: వార్షికోత్సవవేళ యూజర్లకు జియో బంపర్ ఆఫర్లు
గతేడాది బెంగాల్ లో..
గత సంవత్సరం, పశ్చిమ బెంగాల్‌లోని ఒక స్వీట్ దుకాణం 500 కిలోల బరువున్న భారీ లడ్డూను తయారు చేసి ఇలాగే వార్తల్లో నిలిచింది. వివిధ ఆకృతులతో అలంకరించిన ఈ విశేషమైన లడ్డూని చూసేందుకు జనాలు తరలివచ్చారు. ఆలడ్డూపై చిన్న గణేశ విగ్రహం మరియు కాజు స్వీట్, జీడిపప్పు వంటి ఎండిన పండ్లతో అందంగా అలంకరించి, రింగ్ డిజైన్‌లో అమర్చబడి ఉంది. నివేదికల ప్రకారం, ఈ దుకాణం కోల్‌కతాలోని భవానీపూర్ ప్రాంతంలో ఉంది. ఆ లడ్డూ చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
Read Also: Duleep Trophy 2025: ఈసారి ప్రత్యేకంగా దులీప్ ట్రోఫీ.. బరిలో స్టార్లు..!


