Saturday, November 15, 2025
Homeవైరల్Aadhaar in Train: రైల్లో టికెట్‌ అడిగితే ‘ఆధార్‌’ చూపించిన బామ్మ.. ఖంగు తిన్న టీసీ.!

Aadhaar in Train: రైల్లో టికెట్‌ అడిగితే ‘ఆధార్‌’ చూపించిన బామ్మ.. ఖంగు తిన్న టీసీ.!

Old Woman Shows Aadhaar in Train: దేశంలోని పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తున్నాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాయి. ఈ పథకం ద్వారా స్థానికంగా ఆధార్ కార్డు ఉన్న మహిళలు ఆధార్‌ చూపి రాష్ట్రం మొత్తం ఎంపిక చేసిన బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవద్దు. అయితే ఇక్కడ ఓ వృద్ధురాలు చేసిన వింత పని నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. 

- Advertisement -

చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఫ్రీ బస్సుల్లో ఆధార్‌ కార్డు చూపిస్తే చాలు.. కండక్టర్‌ ఫ్రీ టికెట్‌ చేతికి ఇస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా, ఓ వృద్ధురాలు ఎలాంటి టికెట్‌ తీసుకోకుండా రైలు ఎక్కింది. కాసేపటికి టికెట్ కలెక్టర్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె ముందు కూర్చుని అందరిని అడిగినట్లే ఆమెను కూడా టికెట్‌ చూపించమని అడిగాడు. ఆ వృద్దురాలు ఏ మాత్రం తడబడకుండా తన వద్ద ఉన్న ఆధార్‌ కార్డు తీసి అతడి చేతిలో పెట్టింది.

Also Read: https://teluguprabha.net/viral/virat-kohli-post-in-instagram-got-11-million-likes/

ఊహించని ఘటనతో ఒక్కసారిగా ఖంగు తిన్న టీసీ.. ‘ఏంటిది?’ అని వృద్ధురాలిని అడిగాడు. ఇంతలో పక్కనే ఉన్న మహిళ కలగజేసుకుని ‘బస్సులో ఆధార్ కార్డు  చూపిస్తే ఫ్రీ టికెట్ ఇస్తున్నారు కదా.. అలానే రైలు టికెట్ కూడా ఇస్తారనుకుంటోంది’ అని టీసీకి వివరించింది. ఆ మాట విన్న అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. విషయం అర్థమై టీసీ గట్టిగా నవ్వాడు.

ఆధార్ కార్డు వెనక్కు ఇచ్చేసి ‘రైలులో ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇవ్వరు. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే’ అని అర్థమయ్యేలా వివరించాడు. అయితే ఆ బామ్మ ఆ తర్వాత టికెట్‌ తీసుకుందా లేదా తెలియదు. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ‘రైలులో ప్రయాణం చేస్తూ టికెట్‌ కోసం ఆధార్ కార్డు చూపించిన బామ్మ. పాపం.. ఆ పెద్దావిడకు రైలులో ఆధార్ కార్డుతో ఫ్రీగా టికెట్ ఇవ్వరని తెలియదు కదా?. ఆ బామ్మ కల నెరవేరాలంటే రాహుల్ గాంధీ కానీ, సిద్ధరామయ్య కానీ, ప్రధాని కావాల్సిందే’ అని ‘X’ పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలుపలేదు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad