Saturday, November 15, 2025
HomeTop StoriesViral Video: రోడ్డెక్కిన చిల్లర పంచాయితీ.. బస్సుకు అడ్డంగా కూర్చుని ప్రయాణికుడు హల్‌చల్‌

Viral Video: రోడ్డెక్కిన చిల్లర పంచాయితీ.. బస్సుకు అడ్డంగా కూర్చుని ప్రయాణికుడు హల్‌చల్‌

Passenger Protest for rs. 5: బస్సులో చిల్లర పంచాయితీ రోడ్డు పైకి చేరింది. తన టికెట్‌ డబ్బులు పోనూ మిగిలినవి ఇచ్చి తీరాలంటూ ఓ ప్రయాణికుడు రోడ్డుపై ధర్నాకి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/viral/the-young-woman-climbed-a-mobile-tower-viral-video/

‘దయచేసి టికెట్‌కి సరిపడా చిల్లర ఇవ్వగలరు.’ ఏ ఆర్టీసీ బస్సు ఎక్కినా మనకు కనిపించే కొటేషన్‌ ఇది. రోజూ లక్షల మంది ప్రయాణించే ప్రభుత్వ సర్వీసు బస్సుల్లో అందరికీ చిల్లర ఇవ్వాలంటే సాధ్యం కాని పని. కొంతమంది ప్రయాణికులు కండక్టర్ వద్ద చిల్లర లేకపోతే వదిలేసుకుంటారు. మరికొన్ని చోట్ల ఇద్దరు లేదా ముగ్గురిని కలిసీ చిల్లర పంచుకోమనడం సాధారణంగా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఓ ప్రయాణికుడికి తనకు రావాల్సిన మిగిలిన చిల్లర డబ్బులు ఇవ్వలేదని రోడ్డెక్కాడు. 

హైదరాబాద్‌లో కోటి నుంచి పటాన్‌చెరు వెళ్తున్న సిటీ ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు ఎక్కాడు. తను చేరాల్సిన గమ్యస్థానానికి కండక్టర్‌ రూ. 25 టికెట్‌ కొట్టాడు. అయితే ప్రయాణికుడు రూ. 30 చెల్లించడంతో మిగిలిన చిల్లర రూ. 5 తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే కండక్టర్‌ చిల్లర లేదని చెప్పడంతో.. ప్రయాణికుడు గంగారం బస్టాప్‌ వద్ద బస్సు ఆపి రోడ్డుపై అడ్డంగా కూర్చున్నాడు. తన డబ్బులు తనకు ఇవ్వాలని బస్సుకు అడ్డంగా కూర్చుని నిరసనగా తెలిపాడు.

ఘటనతో తోటి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్రడింది. దీంతో కండక్టర్‌ అతనికి రూ. 5 ఇచ్చి పంపించడంతో ప్రయాణికుడు నిరసన విరమించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. కాగా, ఇటీవల ఓ ప్రయాణికురాలు సైతం తనకు డీలక్స్‌ బస్సులో ఫ్రీ టికెట్‌ ఇవ్వాలంటూ బస్సుకు ఎదురుగా కూర్చుని హల్‌చల్‌ చేసింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad