Pen Making Viral Video: గుండు సూది నుంచి గునపం వరకు.. ఏది తయారు చేయాలన్నా ఒక ప్రాసెస్ ఉంటుంది. టెక్నాలజీ మారే కొద్దీ వాటిని తయారు చేసే పద్ధతి కూడా మారుతూ పోతుంది. ఒకప్పుడు పరికరాలను ఎలా తయారు చేస్తారు అనేది ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వారికే అనుభవం ఉండేది. కానీ ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ యుగం, సోషల్ మీడియా ప్రభావంతో వస్తువులను ఎలా తయారు చేస్తారు అనేది తెలుసుకోగలుగుతున్నాం. చిన్న వస్తువును క్షణాల్లో తయారుచేయడానికి పెద్ద పెద్ద మిషన్లను వాడటం మనం వీడియోల్లో చూస్తున్నాం. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇక్కడ ఉంది.
పెన్ను ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అంతర్భాగం. పాఠశాల చదువు మొదలుపెట్టిన నాటి నుంచి పెన్నుతో ఉండే అనుబంధం వేరు. కొంతమందికి కొన్ని ఫేవరెట్స్ పెన్నులు ఉంటాయి. వాటితోనే పరీక్షలు కానీ, ముఖ్యమైన వాటిని కానీ రాయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు గ్రీన్ పెన్. దానికి ఉండే ప్రత్యేకతే వేరు.
Also Read: https://teluguprabha.net/viral/cow-attack-video-viral-socialmedia/
ఇష్టమైన వారికి ఓ ప్రత్యేకమైన పెన్నును కూడా బహుమతిగా ఇస్తుంటారు. ఇలా రకరకాల పెన్నులు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. కానీ ఆ పెన్నును ఎలా తయారు చేస్తారు. ఎలాంటి మిషనరీ వాడతారు.. అనేది మీకు తెలుసా.? ఒక్క పెన్ను తయారు చేయాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో తెలుసా.. అదేంటో ఈ వీడియోలో చూడండి.


