Viral Video Water Bottles In PM Modi Sabha: గురువారం కర్నూల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతంగా జరిగింది. శ్రీశైలం మల్లన్న దర్శనానంతరం కర్నూల్‌లో భారీ బహిరంగా సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అయితే సభలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మంచినీళ్ల బాటిళ్లు, అల్పాహారంగా అరటిపండ్లు, పులిహోర ప్యాకెట్లు ఇలా పెద్ద వాహనాల్లో తరలించారు.
- Advertisement -
అయితే సభ అనంతరం అక్కడ కట్టలకొద్దీ వాటర్ బాటిల్స్, పులిహోర ప్యాకెట్లు, అరటిపండ్లు మిగిలిపోయాయి. దీంతో వాటి కోసం జనం ఎగబడ్డారు. దొరికింది దొరికినట్లుగా ప్రజలు వాటిని భుజాల మీద ఎత్తుకుపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


