Saturday, November 15, 2025
HomeTop StoriesPlane Crashes: చూస్తుండగానే కుప్పకూలిన విమానం.. ఎగిసిపడిన మంటలు, ఇద్దరు మృతి

Plane Crashes: చూస్తుండగానే కుప్పకూలిన విమానం.. ఎగిసిపడిన మంటలు, ఇద్దరు మృతి

Plane Crashes Venezuela: గత కొద్ది నెలలుగా వరుసగా విమాన ప్రమాదాలు కలవరం సృష్టిస్తున్నారు. టేక్‌ఆఫ్‌ అయిన కాసేపటికే విమానాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం, అత్యవసర పరిస్థితుల కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అవ్వడం లేదంటే విమానం లోపల ప్రయాణికుల బ్యాగుల్లో మంటలు ఏర్పడటం లాంటివి ఇటీవల చాలా చోటుచేసుకున్నాయి. విమానం బయలుదేరే ముందు అన్నీ సరిచూసుకున్నా ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక ఘటన వెలుగుచూస్తోంది. తాజాగా ఓ ఫ్లైట్‌ యాక్సిడెంట్‌ నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/viral/prabhas-birthday-ai-video-goes-viral-on-social-media/ 

వెనెజువెలా ఓ విమానం కుప్పకూలిపోయిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. టాచిరాలోని పరమిల్లో ఎయిర్‌పోర్ట్‌లో ఓ చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ బయలుదేరింది. ఈ క్రమంలో విమానం రన్‌వే నుంచి ఎగరగానే ఒక్కసారిగా బోల్తా పడినట్లుగా తిరుగుతూ కిందపడిపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగా.. ఎయిర్‌క్రాఫ్ట్‌లోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 

ఘటన జరుగుతుండగా అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad