Monday, November 17, 2025
Homeవైరల్Viral Video: విద్యార్థిని కొట్టి, తన్ని పోలీసు అధికారి ప్రతాపం.. వైరల్ వీడియో

Viral Video: విద్యార్థిని కొట్టి, తన్ని పోలీసు అధికారి ప్రతాపం.. వైరల్ వీడియో

Student Police Viral Video: విధి నిర్వహణలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సంయమనం పాటిస్తూ సమస్యను పరిష్కరించడం పోలీసుల బాధ్యత. కానీ ఇక్కడ ఓ పోలీసు అధికారి మాత్రం విచక్షణ కోల్పోయి ఓ విద్యార్థిపై తన ప్రతాపం చూపించాడు. తప్పు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సింది పోయి పబ్లిక్‌లో అతనిని దూషించడంతో పాటు దాడికి పాల్పడ్డాడు. యూపీలో జరిగిన ఈ ఘటన నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/viral/ai-romance-video-trending-on-social-media/

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నరమౌ ప్రాంతానికి చెందిన విద్యార్థి అక్షయ్‌ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై కిద్వాయ్ నగర్‌కు వెళ్తున్నాడు. కాగా, ఒక క్రాసింగ్ వద్ద తనిఖీ కోసం బైక్‌ ఆపమని పోలీసు అధికారి చెప్పగా.. అక్షయ్‌ వినపించుకోకుండా స్పీడ్‌గా బైక్‌ పోనిచ్చాడు. వెంటనే పోలీసులు వెంబడించి విద్యార్థిని అదుపులోకి తీసుకుని పోలీస్ అవుట్‌పోస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడే ఉన్న ఎస్సై అమిత్‌ త్రిపాఠీ సింగ్ ఆ విద్యార్థి కాలర్ పట్టుకుని లోపలికి లాగాడు. 

అయితే ఇలా ప్రవర్తించడం చట్ట విరుద్ధమని అక్షయ్‌ అనడంతో సహనం కోల్పోయిన ఎస్సై త్రిపాఠీ ఆ విద్యార్థి చెంపపై పలుమార్లు కొట్టడం, తన్నడంతోపాటు దుర్భాషలాడాడు. కాగా, ఈ చర్యను అక్కడే ఉన్న అక్షయ్‌ స్నేహితుడు రికార్డ్‌ చేశాడు. రికార్డు చేస్తే నిన్ను కూడా కొడతానని ఎస్సై బెదిరించగా.. అప్పటికే మొబైల్‌లో రికార్డ్‌ అయిన ఈ వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. వీడియో వైరల్‌ కావడంతో పోలీసు అధికారి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: https://teluguprabha.net/viral/cow-cess-on-beer-bill-in-jodhpur-rajasthan-viral-photo/

ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఎస్సై త్రిపాఠీ సింగ్‌పై చర్యలు చేపట్టారు. పోలీస్‌ లైన్‌కు ఆయనను అటాచ్‌ చేసిన అనంతరం ఎస్సై దురుసు ప్రవర్తనపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News