Prabhas Birthday AI Video viral: ఇవాళ (అక్టోబర్ 23) డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇందులో ప్రభాస్ బాహుబలి గెటప్‌లో కేక్ కట్ చేస్తూ, సలార్ లుక్‌లో వంట చేస్తూ, కల్కి లుక్ లో బిర్యానీ తింటూ, రాజాసాబ్ గెటప్ లో గిఫ్ట్ తీసుకొస్తూ, బిల్లా లుక్ లో కేక్ తింటూ కనిపిస్తున్నాడు. ఈ ఫన్నీ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అంతేకాకుండా #HappyBirthdayPrabhas హ్యాష్‌ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు.
స్పెషల్ మ్యాష్‌అప్ వీడియో
గీతా ఆర్ట్స్ సంస్థ కూడా ప్రభాస్‌కు ప్రత్యేక కానుక ఇచ్చింది. ఈ సందర్భంగా స్పెషల్ మ్యాష్‌అప్ వీడియోను రిలీజ్ చేసింది. ‘అర్జునుడి లాంటి రూపం, శివుడి లాంటి బలం, రాముడి లాంటి గుణం’ అంటూ సాగే ఈ వీడియోలో ప్రభాస్ నటించిన పలు మూవీ సీన్స్, డైలాగులు, యాక్షన్ షాట్లు అద్భుతంగా ఎడిట్ చేశారు. ఆ ఎలివేషన్ చూస్తే ఫ్యాన్స్ కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.
Also Read: Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రీట్ – ఫౌజీ ఫస్ట్‌లుక్ రిలీజ్ – సోల్జర్‌గా రెబల్‌స్టార్
బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత సలార్, కల్కి 2898 AD సినిమాలతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ త్వరలో రిలీజ్ కానుంది. ఫౌజీ, స్పిరిట్, సలార్ పార్ట్ 2, కల్కి 2 సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.


