Rahul Gandhi At Sweet Shop Video: దేశ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ.. తాజాగా మరోసారి పెళ్లి టాపిక్‌తో వైరల్ అయ్యారు. ప్రజా సందర్శనలకు వెళ్లినప్పుడు అభిమానులు ఆయనను ఆసక్తికరంగా అడిగే మాట.. ‘మీ పెళ్లెప్పుడు’ అని. కాగా, దీపావళి సందర్భంగా ఢిల్లీలోని ప్రముఖ స్వీట్ షాప్‌కు రాహుల్ గాంధీ వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/eci-appoints-observers-for-jubilee-hills-by-election/
సోమవారం రాహుల్ గాంధీ.. పాత ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా స్వీట్ షాపును సందర్శించారు. అక్కడ స్వీట్ షాప్ ఓనర్ సుశాంత్ జైన్.. ఆయనను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’గా అభివర్ణించారు. అంతేకాకుండా రాహుల్ త్వరగా పెళ్లి చేసుకుంటే తమకు పెళ్లి స్వీట్ల ఆర్డర్ వస్తుందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అక్కడి కార్మికులతో సరదాగా గడిపారు. అనంతరం స్వయంగా అక్కడ ఇమర్తీ (జాంగ్రీ), బేసన్ లడ్డూలు తయారు చేయడానికి యత్నించారు.
Also Read: https://teluguprabha.net/national-news/delhi-toxic-air-post-diwali-aqi-severe-level/
గాంధీ కుటుంబంతో ఈ స్వీట్ షాప్‌కు నాలుగు తరాల అనుబంధం ఉండగా.. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి కూడా ఇమర్తీ స్వీట్ అంటే చాలా ఇష్టమని సుశాంత్ జైన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రాహుల్ జీని దేశమంతా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని అంటోందని సుశాంత్ జైన్ అన్నారు. అందుకే ‘రాహుల్ జీ దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి. మేము మీ ముత్తాతకు, అమ్మమ్మకు, మీ తండ్రికి, సోదరి వివాహాలకు ఇక్కడి నుంచే స్వీట్లు అందించాం. ఇప్పుడు మేం కేవలం మీ వివాహం కోసమే ఎదురుచూస్తున్నాం. మీ పెళ్లి స్వీట్ల ఆర్డర్ మా దుకాణానికే వస్తుందని ఆశిస్తున్నాం’ అని సరదాగా అడిగారు. కాగా, స్వీట్ షాప్ ఓనర్ మాటలకు రాహుల్ గాంధీ నవ్వుతూ స్పందించగా.. ఈ పర్యటనకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
नेता प्रतिपक्ष राहुल गांधी जी ने 235 साल पुरानी घंटेवाला मिठाई की दुकान को चलाने वाले परिवार के साथ दिवाली मनाई ।
"सदियों पुरानी इस प्रतिष्ठित दुकान की मिठास आज भी वही है – ख़ालिस, पारंपरिक और दिल को छू लेने वाली।" pic.twitter.com/W2Hiz56D5X
— Ritu Choudhary (@RituChoudhryINC) October 20, 2025


