Saturday, November 15, 2025
Homeవైరల్Viral Video: మీల్స్‌ ధరపై ప్రశ్నించినందుకు రైల్వే క్యాటరింగ్‌ సిబ్బంది అరాచకం.. ఇంతకు తెగిస్తారా.?

Viral Video: మీల్స్‌ ధరపై ప్రశ్నించినందుకు రైల్వే క్యాటరింగ్‌ సిబ్బంది అరాచకం.. ఇంతకు తెగిస్తారా.?

Railway Catering Staff Attack on Passengers: మీల్స్‌ ధరపై ప్రశ్నించినందుకు ప్రయాణికులపై క్యాటరింగ్‌ సిబ్బంది దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. కర్రలు, బెల్టులతో విచక్షణా రహితంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రయాణంలో చోటుచేసుకున్న ఈ ఘటన.. సర్వత్రా ఆగ్రహానికి గురిచేస్తోంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/viral/watch-indian-origin-youtuber-michelle-khare-recreates-one-of-tom-cruises-most-dangerous-scenes-from-the-mission-impossible-movie/

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో రైల్లో ఓ ప్రయాణికుడిపై క్యాటరింగ్‌ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. నిహాల్‌ అనే వ్యక్తి ఇటీవలే తన కుటుంబంతో కలిసి కత్రా నుంచి బినాకు అండమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించాడు. ఈ క్రమంలో రైల్లో భోజనం ఆర్డర్‌ చేశాడు. అయితే రూ. 110గా ఉన్న వెజ్‌ మీల్స్‌ కు రూ. 130 వసూలు చేయడంపై నిహాల్‌ సిబ్బందిని ప్రశ్నించాడు. ధర చాలా ఎక్కువ అని క్యాటరింగ్‌ సిబ్బందితో వాదనకు దిగాడు.

దీంతో ఆగ్రహించిన క్యాటరింగ్‌ సిబ్బంది నిహాల్‌పై దాడికి పాల్పడ్డారు. కొంతమంది కర్రలు, బెల్టులతో తీవ్రంగా కొట్టారు. తోటి ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నించినా వారు వినకుండా విచక్షణ కోల్పోయి ఇష్టారీతిన ప్రవర్తించారు. బోగిలోని ప్రయాణికులు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అవుతోంది. ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Also Read: https://teluguprabha.net/viral/drunk-man-riding-on-royal-bengal-tiger-video-is-going-viral/

అయితే సాధారణంగా రైల్లో భోజనం నాణ్యతపై కూడా చాలా ప్రాంతాల్లో విమర్శలు వ్యక్తమవుతున్న తెలిసిందే. ఉడికీఉడకని భోజనం, రుచీపచీ లేని వంటకాలు, ఇంకా పరిశుభ్రత లేమి.. ఇలా చాలా ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ఇలా పబ్లిక్ రవాణాలో ప్రయాణికులపై దాడికి పాల్పడటం ఆందోళన కలిగిస్తున్న విషయం. భోజనం నాణ్యతా ప్రమాణాలతో పాటు.. ఇలాంటి సంఘటనలపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad