Black King Cobra In Bathroom Commode Video: ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. ఈ క్రమంలో ఫారెస్ట్ కు దగ్గరగా నివసిస్తున్న జనావాసాల్లోకి ప్రమాదకరమైన పాములు వచ్చేస్తుంటాయి. ఇవి ఇళ్లలో ఎక్కడోక్కడ నక్కి మన ప్రాణాలు తీసే అవకాశం ఉంది. అందుకే తరుచూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. తాజాగా ఓ నల్లత్రాచు డాక్టర్ వాష్ రూమ్ లోకి దూరి హల్ చల్ చేసింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
రాజస్థాన్‌లోని నయాపూర ప్రాంతంలో రెసిడెంట్ డాక్టర్ల హాస్టల్ ఉంది. ఇక్కడ ఉంటూ దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి విధులు నిర్వహిస్తూ ఉంటారు వైద్యులు. ఈ నెల 14న అర్ధరాత్రి ఓ డాక్టర్ విధులు ముగించుకుని హాస్టల్ కి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్‌రూంలోకి వెళ్లాడు. సడన్ గా అతడికి ఓ భారీ నల్లత్రాచు కమోడ్ లో పాకుతూ కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే తన తోటి వైద్యులకు సమాచారం చేరవేశాడు. అక్కడకు చేరుకున్న వారంతా పామును కమోడ్ నుండి బయటకు రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో బ్లాక్ కోబ్రాపై నీరు పోయగా.. అది బయటకు వచ్చింది. దీంతో అక్కడున్న వారంతా బయటకు పరుగులు తీశారు.
ఇలా అందరూ భయపడుతూ ఉండగానే స్నేక్ క్యాచర్స్ అక్కడకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గోవింద్ శర్మ అని పాములు పట్టేవాడు ఎంతో తెలివిగా చాకచక్యంతో ఆ సర్పాన్ని పట్టుకున్నాడు. దానిని తీసుకెళ్లి దగ్గరలో ఉన్న అడవిలో విడిచిపెట్టాడు. అతడు చూడకుండా కమోడ్ పై కూర్చుని ఉంటే ఆ కోబ్రా అతడిని తప్పకుండా కాటువేసింది. కాబట్టి బాత్రూమ్ వెళ్లేటప్పుడు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది.
Also Read: King Cobra -చీకులు కొనడానికి వచ్చిన భయంకరమైన కింగ్ కోబ్రా.. ఇదిగో వీడియో!


