Rajasthan Man Walks Into Hospital Holding Huge Snake: ఈ భూమ్మీద ప్రమాదకరమైన వాటిల్లో పాము కూడా ఒకటి. ఒక్క కాటుతోనే ఎంతటివారినైనా పరలోకాలు పంపిస్తుంది. అందుకే మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళాలి. ముఖ్యంగా వ్యవసాయం చేసేవారు అప్రమత్తంగా ఉండాలి, లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తాజాగా అలాంటి వింత ఘటనే రాజస్థాన్ లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
వీడియోలోకి వెళ్తే.. జైపూర్ కు చెందిన ఓ వ్యక్తి సంచి పట్టుకుని హాస్పిటల్ కు వచ్చాడు. అందరూ చూస్తుండగా బ్యాగు నుంచి పెద్ద పామును బయటకు తీశాడు. దీంతో అక్కడకు ఉన్నవారందరూ షాక్ కు గురయ్యారు. ఈ పాము తన కరిచిందని, వెంటనే తనకు ట్రీట్మెంట్ చేయాలని వైద్యులను వేడుకున్నాడు. ఆ భారీ పామును చూసి రోగులు, హాస్పిటల్ సిబ్బంది హాడలిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
ఈ సంఘటన వివరాలు రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ మంగళ్ చెప్పారు. ఆయన ఏమన్నారంటే.. నాలుగు రోజుల కిందట ప్రకాశ్ మండల్ అనే వ్యక్తి ఓ భారీ స్నేక్ ను తీసుకుని తమ హాస్పిటల్ కు వచ్చాడని.. పొలంలో పని చేసుకుంటుండగా ఆ పాము ఈ మనిషిని కరిచిందంట.. అయితే అది విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవడం కోసం దానిని హాస్పిటల్ కు తీసుకొచ్చినట్లు ప్రకాశ్ చెప్పినట్లు డాక్టర్ చెప్పారు. అయితే అది డేంజరస్ స్నేక్ అయిన రస్సెల్ వైపర్ కావడంతో వైద్యులు వెంటనే అతడికి చికిత్స చేసి అతడి ప్రాణాలు కాపాడారు. ప్రకాశ్ మండల్ తనకు చికిత్స చేస్తున్నప్పుడు కూడా ఆ పామును వదలడానికి నిరాకరించడట. వైద్యులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో చివరకు ఒప్పుకున్నాడు.