Homeవైరల్Rakhi Sawant comments: రాఖీ సావంత్‌ రచ్చ రచ్చ.. విజయ్ త్రిష పెళ్లిలో డ్యాన్స్ చేస్తానంటూ...

Rakhi Sawant comments: రాఖీ సావంత్‌ రచ్చ రచ్చ.. విజయ్ త్రిష పెళ్లిలో డ్యాన్స్ చేస్తానంటూ కామెంట్స్‌

Rakhi Sawant shocking comments on Vijay-Trisha: తమిళనాడు రాజకీయాలు గంటకో ట్విస్ట్‌తో ఉత్కంఠభరితమైన సినిమాను తలపించాయి. ఎట్టకేలకు టీవీకే విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అన్ని అడ్డంకులు తొలగి మే 10న మధ్యాహ్నం 3 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఒకవైపు రాజకీయాల్లో ఇంతటి హడావుడి జరుగుతుంటే, మరోవైపు విజయ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విజయ్‌ భార్య విడాకులివ్వడం, నటి త్రిషతో ఆయన ఓ వివాహ వేడుకకు హాజరవ్వడం చకచకా జరిగిపోయాయి. దీంతో, విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష బంధం గురించి, వారిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ చర్చ ఇలా ఉండగానే, బాలీవుడ్ వివాదాస్పద నటి రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యాయి.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/business/rbi-big-shock-to-yes-bank/

వారిద్దరి మెహంది వేడుకలో డాన్స్‌ చేస్తా..

ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ చేసి రచ్చ చేసే రాఖీ సావంత్, విజయ్-త్రిష పెళ్లి అంశంపై నోరు పారేసుకుంది. “త్రిష నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆమె ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకుంది. నాకు విజయ్ అంటే చాలా ఇష్టం, ఆయనతో కలిసి నటించాలని, కనీసం ఒక పాటలో అయినా స్టెప్పులు వేయాలని ఎప్పటి నుంచో కలలు కన్నాను. కానీ ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు విజయ్‌, త్రిష ఇద్దరికీ పెళ్లి జరిగితే, కనీసం వారి మెహందీ వేడుకలో లేదా పెళ్లిలో అయినా డ్యాన్స్ చేస్తాను. ఆ సమయంలో ఇద్దరితో కలిసి ఫోటో దిగుతాను” అంటూ రాఖీ చెప్పుకొచ్చింది. విజయ్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే బాధ్యతాయుతమైన పనిలో నిమగ్నమై ఉంటే, రాఖీ సావంత్ మాత్రం తన పబ్లిసిటీ కోసం ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు ఫైరవుతున్నారు. గతంలో బిగ్ బాస్ షో నుంచి మొదలుకొని, ఇండస్ట్రీలో ఏ చిన్న విషయం జరిగినా దానిపై కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ ట్రెండ్ అవ్వాలని చూసే రాఖీ తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు. “సమయం సందర్భం లేకుండా మాట్లాడటం నీకు అలవాటే” అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి రాఖీ సావంత్‌ కాంట్రవర్సీ కోసం చేసిన కామెంట్స్‌ నిజమవుతాయా? లేదా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News