Sunday, March 8, 2026
HomeTop StoriesRenu Desai: ట్రోలర్స్‌పై రేణు దేశాయ్‌ ఫైర్‌.. తల్లిదండ్రుల ముందు నిలబెడతానని స్ట్రాంగ్‌ వార్నింగ్‌.!

Renu Desai: ట్రోలర్స్‌పై రేణు దేశాయ్‌ ఫైర్‌.. తల్లిదండ్రుల ముందు నిలబెడతానని స్ట్రాంగ్‌ వార్నింగ్‌.!

Renu Desai Fires on Negative Comments: సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోల్స్‌ దాడిపై సినీ నటి రేణు దేశాయ్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితం మొదలుకొని ఇటీవల వీధి కుక్కల సంరక్షణ అంశంపై చేసిన నెగిటివ్‌ కామెంట్స్‌పై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను అసభ్య పదజాలంతో దూషించిన వారి ఇంటికి వచ్చి మరీ వారిని నిలదీస్తానని స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తన ఇన్‌స్టా అకౌంట్‌ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.

- Advertisement -

దిగజారిపోయారు

ఫేక్ అకౌంట్ల ద్వారా తనను అసభ్య పదజాలంతో దూషించే వారిని వదిలిపెట్టబోనని సినీ నటి రేణు దేశాయ్‌ గట్టిగా హెచ్చరించారు.  తన పిల్లల జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. వీధి కుక్కల సంరక్షణ అంశంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితం(డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ)పై ట్రోలర్స్ చేస్తున్న నెగిటివ్ కామెంట్స్‌పై రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. యూట్యూబ్ ఛానళ్లు దిగజారిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్యకరంగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-orders-on-allotment-of-sharada-peetham-land-to-water-board/

తనను విమర్శించే వారిని వెతికి పట్టుకుని వారి తల్లిదండ్రుల ముందు నిలబెట్టి వారి ప్రవర్తనను ఎండగడతానని రేణు దేశాయ్‌ వ్యాఖ్యానించారు. ముఖం చూపించడానికి ధైర్యం లేని వ్యక్తులు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని ఇలాంటి దారుణమైన కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను మూగజీవుల కోసం మాత్రమే పోరాడుతున్నానని.. మనుషుల కోసం కాదని.. దీనికి అనవసర రూమర్స్ సృష్టించవద్దని క్లారిటీ ఇచ్చారు.

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/cm-revanth-reddy-distribute-compensation-to-mecca-accident-victims/

ఇదే సంస్కారంతో పెంచారా?

‘గత నెలలో వీధికుక్కల అంశంపై నేను హైదరాబాద్‍‌లో మీడియా సమావేశం నిర్వహించా. ఓ ఎన్జీవో బృందం బలవంతంగా ఈ ప్రెస్ మీట్‌కు రప్పించింది.  ఆరోజు కూడా తాను పది చెడ్డ కుక్కల కోసం 90 మంచి కుక్కలను చంపడమేమిటని మాత్రమే ప్రశ్నించా. దీంతో నాపై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు. వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ ఇష్టారీతిన మాట్లాడారు. మీవాళ్లు మిమ్మల్ని ఇదే సంస్కారంతో పెంచారా. మీరు చేసే పని మీ అమ్మానాన్నకు, అక్కాచెల్లెళ్లకు చూపించాలి. మరో ఘటనలో చిన్నపిల్ల చనిపోతే నా మాటలను ఎడిట్ చేసి ఆ ఘటనకు అటాచ్ చేశారు. మీలాంటి వారిని వెతుక్కుంటూ వచ్చి మీ అమ్మానాన్న వద్ద మీ దుర్మార్గాలను ఎండగడతా. దిగజారిన వాళ్లు మాత్రమే మరో వ్యక్తిపై దారుణమైన కామెంట్లు చేస్తారని అన్నారు. దయచేసి సోషల్‌ మీడియాలో అసభ్య పదజాలం ఉపయోగించకండి.’- అని రేణు దేశాయ్‌ వీడియోలో మాట్లాడారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News