Saturday, November 15, 2025
HomeTop StoriesViral: పేదింట్లో పుడితేనేం.. తాత క్యారెక్టర్‌కి వెల కట్టలేం.. రిక్షావాలాకి కారు యజమాని సలాం.!

Viral: పేదింట్లో పుడితేనేం.. తాత క్యారెక్టర్‌కి వెల కట్టలేం.. రిక్షావాలాకి కారు యజమాని సలాం.!

Viral Video: సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే మానవతా విలువలు మంటగలిసిపోయాయేమో అనిపిస్తుంటుంది. కానీ అలాంటి సమాజంలోనే మానవత్వం ఇంకా బతికి ఉందంటూ కొందరి నిజాయతీ నిరూపిస్తుంటుంది. ప్రతి నిత్యం గల్లీ రోడ్లు మొదలుకొని హైవేల వరకూ ప్రమాదాల వార్తలు చూస్తూనే ఉంటాం. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ రోడ్డుపై వాహనాలను ఢీకొంటూ ఎందరో ప్రాణాలను బలితీసుకుంటున్నారు కొందరు. ఆ తర్వాత తమకేమీ సంబంధం లేదన్నట్లు రోడ్డుపై వారి మానాన వారిని వదిలేసి వెళ్తుంటారు. 

- Advertisement -

రోడ్డుపై మీరు ఎంత జాగ్రత్తగా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తూ వెళ్తున్నా.. కొందరి నిర్లక్ష్యం, అతి వేగం మీ ప్రాణాలను పణంగా పెడుతుంది. మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది. అలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై ఉంటుంది. కానీ.. ఆ భారమంతా తమపై పడుతుందని, జైలుకెళ్లాల్సివస్తుందని ఆ పాపాన్ని మోసుకుంటూ అక్కడి నుంచి తప్పించుకుని పోతారు. తమ చేతిలో డబ్బున్నా కూడా ఇవ్వడానికి మనసొప్పదు.

Also Read: https://teluguprabha.net/viral/watch-lovers-kissing-in-delhi-metro-train-video-goes-trending-on-social-media/

కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. రిక్షా నడుపుకొనే ఓ వృద్ధుడు తన వల్ల ఇతరులకు ఏ హానీ జరగకూడదు అనుకునే మనస్తత్వం. ఎదుటి వాడు సంపన్నుడు అయినా తను చేసిన పొరపాటుకు మూల్యం చెల్లించుకునే దయాగుణం. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ వృద్ధుడి క్యారెక్టర్‌కు కారు యజమానే కాదు నెటిజన్లు సైతం సలాం కొడుతున్నారు. 

 

రిక్షా నడుపుకొనే ఓ వృద్ధుడు పార్కింగ్‌లో ఉన్న ఓ  ఖరిదైన కారుకు పొరపాటున తగలడంతో గీతలు పడ్డాయి. అయితే ఆ స్థానంలో మరే వ్యక్తి అయినా ఎవరూ చూడలేదు కదా అని అక్కడి నుంచి తప్పించుకుని పోతారు. కానీ ఈ వృద్ధుడు అలా పారిపోలేదు. ఆ కారు యాజమాని వచ్చేంత వరకు వేచి చూశాడు. ఆయన రాగానే తన వల్ల జరిగిన పొరపాటును వివరించాడు. 

Also Read: https://teluguprabha.net/viral/watch-a-rare-5-headed-cobra-snake-video-goes-trending-on-social-media/

కారుపైన గీతలు పడినందుకు క్షమించమని కోరుతూ పరిహారంగా కొంత నగదు ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఆ కారు యాజమాని ఆ వృద్ధుడి నిజాయతీ నచ్చి డబ్బులు తీసుకోకుండా ఆయనను పంపించివేస్తాడు. ఈ వీడియోలో ఆ వృద్దుడి నిజాయతీ ఎంతగా ఆకట్టుకుంటుందో.. అతడి పట్ల ఆ కారు యాజమాని ప్రదర్శించిన తీరు అతని క్షమాగుణాన్ని తెలియజేస్తుంది. బీదవాడిగా పుట్టినా ఆ తాత గుణానికి వెల కట్టలేమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రోడ్డుపై యాక్సిడెంట్లకు కారణమై పారిపోయేవారు తాతను చూసి నేర్చుకోవాలని హితబోధ చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad