Saturday, November 15, 2025
HomeTop StoriesRussia Mi-8 helicopter crash : వైరల్ వీడియో! కళ్ల ముందే కూలిన హెలికాఫ్టర్.. నలుగురు...

Russia Mi-8 helicopter crash : వైరల్ వీడియో! కళ్ల ముందే కూలిన హెలికాఫ్టర్.. నలుగురు మృతి!

Russia Mi-8 helicopter crash : రష్యా దక్షిణ భాగంలోని డాగెస్తాన్ ప్రాంతంలో Mi-8 హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఆర్మీకి చెందిన ఈ హెలికాప్టర్ ఓ ఇంటి గది మీద పడి మంటలు ఎగిసిపడటంతో 7 మంది ప్రయాణికుల్లో నలుగురు సజీవ దహనమయ్యారు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెలికాప్టర్ కూలిపోతున్న దృశ్యాలు, మంటలు ఎగసిపడటం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

ALSO READ: AP CII Summit: సీఐఐ సదస్సుతో ఉత్తరాంధ్రలో పెట్టుబడుల వెల్లువ, పర్యాటకానికి బూస్ట్

రష్యా ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ మంత్రి యారోస్లావ్ గ్లాజోవ్ ప్రకారం, ఈ హెలికాప్టర్ కిజ్ల్యార్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్ (KEMP) సిబ్బందిని తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. KEMP సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాలకు గ్రౌండ్ కంట్రోల్, డయాగ్నస్టిక్ సిస్టమ్‌లు తయారు చేసే కంపెనీ. ప్రమాద స్థలం మచాచ్కలా గ్రామం, డెర్బెంట్ జిల్లా. మృతుల్లో ముగ్గురు సీనియర్ ఇంజనీర్లు, ఒక టెక్నీషియన్ ఉన్నారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే సాంకేతిక లోపం వల్ల కూలిపోయిందని ప్రాథమిక దర్యాప్తులో తెలిపింది. రక్షణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇక దీనికి సంబంధించిన వీడియోలో, హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ఎగిరి, ఆకస్మికంగా కూలిపోతూ మంటలు ఎగిసిపడటం కనిపిస్తుంది. స్థానికుడు రికార్డ్ చేసిన ఈ దృశ్యాలు X (ట్విటర్), యూట్యూబ్‌లో వైరల్ గా మారాయి. రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ ప్రాథమిక నివేదికలో, “పైలట్ ఎమర్జెన్సీ సిగ్నల్ ఇచ్చాడు, కానీ సమయం లేకుండా పోయింది” అని చెప్పింది. డాగెస్తాన్ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 2024లో రష్యాలో 12 హెలికాప్టర్ ప్రమాదాలు జరిగి, 45 మంది మరణించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad