Saturday, November 15, 2025
Homeవైరల్Viral Video: ఇదేందయ్యా ఇదీ.. స్కూల్‌లో ఉండాల్సిన అమ్మాయిలు ఇక్కడున్నారేంటి.?

Viral Video: ఇదేందయ్యా ఇదీ.. స్కూల్‌లో ఉండాల్సిన అమ్మాయిలు ఇక్కడున్నారేంటి.?

Schools girls at Liquor Shop: ఈ వీడియో చూస్తే ఒక్కసారిగా ఉలిక్కిపడటం ఖాయం. ‘నా కళ్లు చూస్తున్నది నిజమేనా’ అని కచ్చితంగా అనుకుంటారు. అమ్మాయిలు ఇక్కడ ఉన్నారేంటి అని ఆశ్చర్యపోతారు.. అదీ స్కూల్‌ యూనిఫాంలో.. ఇంతకీ ఏం జరిగింది.. ఆ విద్యార్థినులు ఏం చేశారు.. ఎక్కడున్నారు.. అనే వివరాలు చూద్దాం.. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/viral/mother-brought-band-melam-for-daughters-to-wake-up/

స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు విద్యార్థినులు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వైన్ షాపు వద్ద నిలబడ్డారు. అంతే కాదు అక్కడ మద్యం కొనుగోలు చేశారు. ముఖం కనపడకుండా ఓ అమ్మాయి స్కార్ఫ్‌ కట్టుకుంటే.. ఇంకో బాలిక చున్నీతో కవర్‌ చేసింది. ఈ విచిత్రాన్ని అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు కళ్లప్పగించి చూస్తున్నారు.. ఏంటిదీ అని.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నైన్‌పూర్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణానికి వెళ్లిన ఇద్దరు స్కూల్‌ విద్యార్థినులు అక్కడ మద్యాన్ని కొనుగోలు చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానిక వార్తా ఛానల్‌లో ప్రసారమైన ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరింది. దీంతో దర్యాప్తు చేపట్టారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్‌డీఎం) అశుతోష్ ఠాకూర్, తహసీల్దార్, స్థానిక పోలీసులతో కలిసి ఆ ప్రభుత్వ లిక్కర్‌ షాపు వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు.

Also Read: https://teluguprabha.net/viral/watch-man-converts-train-washroom-into-makeshift-personal-bedroom-video-is-going-viral-on-social-media/

కాగా, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా స్కూల్‌ బాలికలకు మద్యం అమ్మడంపై వైన్‌ షాపు సిబ్బంది అధికారులు ఆరా తీశారు. ఆ విద్యార్థినులు వారంతట వారే ఇక్కడకు వచ్చారా.. లేక ఎవరైనా వారిని పంపించారా.. అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. షాపు యజమానిని సైతం విచారిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఎస్డీఎం ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ ఘటన నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad