Saturday, November 15, 2025
Homeవైరల్Free Bus Scheme: 'ఫ్రీగా జర్నీ చేసే మీకు ఇంత రుబాబా'.. మహిళపై సీనియర్‌ సిటిజన్‌...

Free Bus Scheme: ‘ఫ్రీగా జర్నీ చేసే మీకు ఇంత రుబాబా’.. మహిళపై సీనియర్‌ సిటిజన్‌ ఫైర్‌.. వీడియో

Senior Citizen Fires on Woman for seat in RTC Bus:  తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి వచ్చాక..  ప్రయాణికుల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్న వీడియోలో నిత్యం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డ్రైవర్‌, కండక్టర్లతో పాటు తోటి ప్రయాణికులు గొడవను ఆపేందుకు ప్రయత్నించినా.. తగ్గేదేలే అన్నట్లు పోట్లాటకు దిగుతున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ గొడవలు మహిళల మధ్యే జరిగాయి. కానీ ఈ సారి ఓ సీనియర్‌ సిటిజన్‌(పురుషుడికి), మహిళకు మధ్య సీటు కోసం వివాదం చోటుచేసుకుంది.  

- Advertisement -

Also Read: https://teluguprabha.net/viral/the-wrestler-lost-to-a-little-girl-and-then-ran-away-video/

సాధారణంగా ఆర్టీసీ బస్సులో స్టార్టింగ్‌లో రెండు సీట్లు వృద్ధులు(సీనియర్‌ సిటిజన్స్‌), వికలాంగులు, గర్భిణీల కోసం కేటాయించారు. ఇక, కుడి, ఎడమ వైపు కలిపి ఓ ఆరు, ఏడు సీట్ల వరకూ మహిళల కోసం కేటాయించగా.. మిగతా సెక్షన్‌ అంతా పురుషులు కూర్చుంటారు. అయితే మొదటి వరుసలోని సీనియర్‌ సిటిజన్ల కోసం కేటాయించిన సీట్లు ఖాళీగా ఉన్న సందర్భాల్లో ఇతరులు కూర్చున్నా.. మళ్లీ సదరు కోటా వ్యక్తులు వచ్చినప్పుడు వారికి ఆ సీటు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఓ మహిళ ఆ పని చేయలేదు. దీంతో ఓ సీనియర్‌ సిటిజన్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మహిళపై వాగ్వాదానికి దిగారు.  

హైదరాబాద్‌లోని పటాన్‌చెరు నుంచి కోఠి వెళ్లేందుకు ఓ సీనియర్‌ సిటిజన్‌ ఆర్టీసీ సిటీ బస్సు ఎక్కి.. వారి కోసం రిజర్వ్‌ అయిన సీటులో కూర్చునేందుకు వెళ్లారు. అప్పటికే ఒక మహిళ ఆ సీట్లో కూర్చొని ఉండగా సదరు మహిళను లేచి, తనకు సీటు ఇవ్వాలని కోరాడు. అందుకు మహిళ నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఫ్రీ బస్సులో జర్నీ చేసే మీకు ఇంత రుబాబా.. ఫ్రీ జర్నీ చేసే మీరు కూర్చుంటే.. పైసలు పెట్టిన మేం నిల్చోవాలా అని మహిళను నిలదీశారు. దీంతో ఆ సీనియర్‌ సిటిజన్‌పై బస్సులో ఉన్న మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళకు వంత పాడారు.

చాలా సేపు గొడవ అనంతరం ఎట్టకేలకు కొందరు మహిళలు బస్సు దిగాకా.. ఆ సీనియర్‌ సిటిజన్‌కు సీటు దొరికింది. ఈ సంఘటనను అంతా అదే బస్సులో వెనుక సీట్లో కూర్చున్న ఒకరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. కానీ ఇక్కడ రెండు విధాలుగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

Also Read: https://teluguprabha.net/viral/customer-compliments-to-blinkit-delivery-boy-viral-post/

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమనేది.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఓటర్లకు ఇచ్చిన హామీ. ఆ హామీ ప్రకారమే మహిళలకు ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చింది. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ‘ఫ్రీ బస్సులో కూర్చునే మీకు ఇంత రుబాబా అని సీనియర్‌ సిటిజన్‌ విమర్శించడం సరైంది కాదు. సదరు వ్యక్తి కుటుంబంలోని మహిళలు కూడా ఆ ఫ్రీ బస్సు స్కీంను సద్వినియోగం చేసుకుంటున్నారని గ్రహించాలి. అలా ఆలోచించకుండా మహిళపై చిందులు తొక్కడం కరెక్ట్‌ కాదు. 

మరో విషయం ఏంటంటే.. ఆర్టీసీ బస్సులో ఎవరికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వడం సరైన పద్ధతి. అలా కాదని.. సీటు ఇవ్వను అని మహిళ అనడం సబబు కాదు. ఇక్కడ ఎవరికి వారు ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక గొడవ పడ్డారే తప్ప.. సరైన దారిలో సమస్యను పరిష్కరించుకోలేదు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad