Saturday, November 15, 2025
Homeవైరల్Viral Video: వామ్మో కలికాలం అంటే ఇదేనా..బతికున్న పాముని తిన్న ఉడుత

Viral Video: వామ్మో కలికాలం అంటే ఇదేనా..బతికున్న పాముని తిన్న ఉడుత

Viral Video: కలికాలం ఇలానే ఉంటుందని బ్రహ్మం కొన్ని హింట్స్ ఇచ్చారు. ఇప్పుడు అచ్చం అలానే జరుగుతోంది. చిన్నజీవులు పెద్ద వాటిని అంతంచేస్తాయని చెప్పారు. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి జరిగింది. మన పరిసరాల్లో చలాకీగా తిరుగుతూ ఉండే చిరు జీవులు ఉడుతలను చూసే ఉంటారు. అయితే ఈ చిన్న జీవులు పాముల కంటే ప్రమాదకరమైనవని బహుశా ఎవరూ ఊహించనైనా ఊహించి ఉండరు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉడుతకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూస్తే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది నిజమేనా అని నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఈ వీడియోలో ఒక ఉడుత పాము లాంటి విష జీవిని సజీవంగా నమిలి తింటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉడుతను ఒక సాదు జీవిగా భావించిన ప్రజలు.. ఈ ఉడుత అసలు రూపాన్ని చూసి షాక్ అవుతున్నారు. ఇది నిజమేనా అని ఆలోచిస్తున్నారు.

- Advertisement -

Read Also: Man bit Snake: కాటేసిన పాము తల కొరికి నిద్రపోయిన మందు బాబు.. ఆ తర్వాత ఏం జరిగింటే?

వైరల్ వీడియో

కాగా.. వైరల్ అయిన వీడియోలో ఎండిన ఆకుల మధ్య ఒక పాము పాకుతూ ఉంది. అకస్మాత్తుగా ఒక ఉడుత కనిపించింది. సాధారణంగా చిన్న చిన్న జీవులు పాములు అంటే భయపడి పారిపోతాయి.. అయితే ఈ ఉడుత చాలా భిన్నంగా ఉంది. ఇది పాముపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించింది. కొద్దిసేపటికే ఉడుత పాముపై తన ఆధిక్యం ప్రదర్శించి దానిని నమలడం ప్రారంభించింది. ఈ ఘటన అసలు ఊహించనిది. చూస్తున్నవారు తమ కళ్ళను తామే నమ్మడం కష్టం.  ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @AmazingSights అనే అకౌంట్ లో షేర్ అయ్యింది. ఆ వీడియోకు “ఉడుత పామును చంపి తింటుంది” అనే క్యాప్షన్‌ ఉంది. దాదాపు ఒక నిమిషం నిడివి గల ఈ వీడియోకు 29 వేల వ్యూస్ రాగా.. వందలాది లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా, ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిసింది. పాములకు భయపడేవారు ఇకపై ఉడుతలను చూసి కూడా భయపడాల్సి ఉంటుందని ఓ యూజర్ రాసుకొచ్చాడు. మరొకరు “ఈ ఉడుతను ‘అడవి సింహం అని పిలవాలి.” ఇంత చిన్న జీవికి పాములాంటి విష జీవిని బతికి ఉండగానే తినడానికి ధైర్యం ఎలా వచ్చిందో అంటూ చాలామంది ఆశ్చర్యపోయారు.

Read Also: Chinneti Vaagu: వృద్ధురాలు చేసిన పని చేయలేక.. వాగును దాటే అవగాహన లేక యువకుడు గల్లంతు..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad