Techie’s Viral Post on Missing Father’s Last Call: “నాన్న చనిపోయారు… ఆయన చేసిన చివరి కాల్ నేను ఎత్తలేకపోయాను. ఇంకా సమయం ఉందని అనుకున్నాను, కానీ నేను పొరబడ్డాను.” అంటూ ఓ భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లక్షలాది మంది హృదయాలను కదిలించింది. వివేక్ నస్కర్ అనే టెక్కీ, తన తండ్రి మరణంతో తాను అనుభవిస్తున్న వేదనను అక్షరాల్లో పంచుకున్నారు.
“ఈ ఉదయం మా నాన్నగారు చనిపోయారు. రాత్రి పనిలో ఉండటం వల్ల అమ్మ దగ్గర నుంచి 20కి పైగా కాల్స్ వచ్చినా నేను చూడలేదు. ఉదయం 8 గంటలకు ఫోన్ ఎత్తగానే, వెంటనే ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, కానీ ఇంటికి చేరేసరికి రాత్రి 7 అవుతుంది,” అని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో మరో ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్నానని, తన మనసులో వేల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయని తెలిపారు.
ALSO READ: Michingan Lottery: స్కామ్ కాల్ అనుకుంటే జాక్‌పాట్ తగిలింది.. 65 ఏళ్ల బామ్మ రూ. కోట్లకు అధిపతి
ఆయన తన ఫోన్ కాల్ లిస్ట్ చూసుకున్నప్పుడు, తన తండ్రి కూడా కాల్ చేసినట్లు గుర్తించారు. “నాన్న కాల్ చేశారు, కానీ నేను తిరిగి కాల్ చేయలేదు. ఎందుకో, ఆయనతో మాట్లాడటానికి నాకెప్పుడూ సమయం ఉంటుందనే భ్రమలో ఉండిపోయాను. మా మధ్య చివరి సంభాషణలు కొన్ని చిన్న చిన్న గొడవలతో ముగిశాయి. కానీ మేమిద్దరం ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నాం. నేను ఆయన గర్వకారణమని అమ్మతో చెప్పేవారట, కానీ నాతో ఎప్పుడూ చెప్పలేదు,” అని కన్నీటిపర్యంతమయ్యారు.
ALSO READ: Viral Video: ఇలాంటి కొడుకు ఉంటే ఏ తల్లికీ వృద్ధాశ్రమం అవసరం ఉండదు.. బుడ్డోడి వైరల్ వీడియో
“నేను సాధారణంగా భావోద్వేగాలకు లోనుకాను. కానీ ఇప్పుడు నాలో ఏం జరుగుతుందో చెప్పలేకపోతున్నాను. మా అమ్మ, చెల్లి ముందు ధైర్యంగా ఉండాలి. అందుకే నా బాధను ఇక్కడ రాస్తున్నాను. నాన్నను చివరిసారి చూసేందుకు నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను,” అంటూ ఆయన రాసిన పోస్ట్ వైరల్ అయింది. ఈ పోస్ట్ చదివిన నెటిజన్లు వివేక్‌కు ధైర్యం చెబుతూ, తమ సొంత విషాద కథలను పంచుకుంటూ ఓదార్పునిస్తున్నారు.
ALSO READ: Viral: విండో సీటులో కూర్చుని ఫోన్ చూస్తున్న మహిళకు ఊహించని షాక్.. తర్వాత ఏం జరిగిందంటే.!


