women fighting in running bus video: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయి. మహాలక్ష్మీ ఫ్రీ బస్సు స్కీమ్ కింద తెలంగాణ సర్కార్ డిసెంబర్ 9, 2023 నుంచి… స్త్రీ శక్తి పథకం కింద ఏపీ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తున్నాయి. ఇది వచ్చిన తర్వాత స్త్రీలు అవసరం ఉన్నా లేకపోయినా బస్సు జర్నీ చేస్తున్నారు. అంతేకాకుండా సీటు కోసం ఇతరులతో గొడవలు పెట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పుణ్యమా అని నిత్యం ఏదో ఒక చోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని ఓ రన్నింగ్ బస్సులో ఇద్దరు మహిళలు సీటు కోసం పొట్టు పొట్టున కొట్టుకున్నారు. పక్కన ఉన్నవారు ఎంత చెప్పినా వినిపించకోకుండా తగ్గేదే లే అన్నట్లు కొట్టుకున్నారు. వీరు గొడవ పడుతున్న సమయంలో తోటి ప్యాసింజర్స్ తీవ్ర అసహనానికి గురయ్యారు. అక్కడున్న వారు ఈ మెుత్తం యవ్వారాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.
చిన్న చిన్న విషయాలకు మహిళలు కొట్టుకోవడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం వల్లే ఈ వివాదాలకు కారణమవుతున్నాయని నెటిజన్స్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఉచిత బస్సు పథకం వల్ల ఎక్కువ మంది లబ్ధి పొందుతున్న.. అక్కడక్కడే జరిగే ఇలాంటి చిల్లర గొడవల వల్ల ప్రభుత్వం పెట్టిన ఈ స్కీమ్ విమర్శల పాలవుతుంది. ఈ స్కీమ్ వల్ల ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం పడుతున్న ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు విజయవంతంగా దీన్ని అమలు చేస్తున్నాయి.
Also Read: Viral Video-ట్రీట్మెంట్ చేస్తున్న లేడీ డాక్టర్‌కి సైట్ కొడుతున్న పిల్లాడు.. ట్రెండింగ్ లో వీడియో..


