Saturday, November 15, 2025
Homeవైరల్Viral: యువతిని అసభ్యంగా తాకిన ఆలయ పూజారి.. వైరల్ గా మారిన వీడియో..

Viral: యువతిని అసభ్యంగా తాకిన ఆలయ పూజారి.. వైరల్ గా మారిన వీడియో..

Temple Priest For misbehave With women devotees: కర్నాటక నుంచి ఓ షాకింగ్ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఆలయ పూజారి తమ ఇంటి అమ్మాయితో అసభ్యంగా నెపంతో అతడిని చితకబాదారు కుటుంబ సభ్యులు. గుడికి వచ్చిన యువతిని అనుచితంగా ప్రవర్తించడంతోపాటు దుస్తులు తొలగించాలని కోరినట్లు తెలుస్తోంది. కోపంతో యువతి కుటుంబసభ్యులు పూజారిని కొట్టిన దృశ్యాలు వీడియోలు స్పష్టంగా చూడవచ్చు.

- Advertisement -

ఇందులో పూజారిని కర్రలతో కొట్టడం చూడవచ్చు. ఆ పంతులు తప్పించుకోవాలని చూసినా వారు పట్టుకుని కింద పడేసి కొట్టారు. తుమకూరులోని దేవరాయనదుర్గ ఆలయ పూజారి నాగభూషణాచార్య ఇలాంటి పాడుపనికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన నాలుగు రోజుల కిందట జరిగింది. ఆశీర్వాదించాల్సిన వ్యక్తి ఇలా అనుచితంగా ప్రవర్తించడం పట్ల నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.

కోనసీమలో కూడా ఇలాంటి ఘటనే..
ఇటీవల ఏపీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. యువతి జాతకం చూసి నాగదోషం ఉందని చెప్పిన పూజారి ఆమెపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. కోలమూరు గ్రామానికి చెందిన ఓ యువతి వివాహ, ఉద్యోగం విషయంలో ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో జంగారెడ్డి గూడెం లలితాదేవి ఆలయంలో అర్చకత్వం చేస్తున్న ఓ పూజారిని సంప్రదించింది. ఆయన జాతకం చూసి నాగదోషం ఉందని ఆమెకు చెప్పాడు.

దీని కోసం లలితాదేవి ఆలయానికి బదులు రావులపాలెం దగ్గర గల మందపల్లి శనైశ్చరస్వామి ఆలయానికి రావాలని చెప్పాడు. అక్కడ ఆమె చేయి పట్టుకుని హోమం చేయించాడు. తనకు ఇబ్బందిగా ఉందని ఆమె చెప్పడంతో.. ఇలానే చేయాలని అతడు చెప్పాడు. పూజానంతరం స్నానం చేయాలని పూజారి ఆమెకు చెప్పడంతో బాత్రూమ్ లోకి వెళ్లింది. వెంటనే బాత్రూమ్ లోకి చొరబడిన పూజారి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు, అరుపులు వేస్తూ పూజారిని బయటకు నెట్టేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు.

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad