Cobra Snake Surprise In The Bed Room: వర్షాకాలం వచ్చేసింది. ఈ సమయంలో మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోకపోతే పాములు, పురుగులు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. మనం ఎంత క్లీన్ గా ఉంచుకున్న ఒక్కోసారి పాములు ఇంట్లోకి దూరుతాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నాగుపాము ఏకంగా బెడ్ రూమ్ లోకి వచ్చి అక్కడ ఉన్న కర్టెన్ లో నక్కింది. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
వీడియోలోకి వెళ్తే.. ఒక నాగుపాము ఏకంగా బెడ్ రూమ్ లోకి దూరి.. అక్కడే ఉన్న కర్టెన్ మీద ఎక్కి మరి బుసలు కొట్టడం మెుదలుపెట్టింది. దీంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ పాము ఎవరికీ ఏ హాని చేయకుండా కర్టెన్ మీద పడగ విప్పి కూర్చుంది. అక్కడ ఉన్న ఫోటోలు, వీడియోలు తీస్తుంటే ఏంచెక్కా ఫోజులిచ్చింది. దీంతో సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడకు వచ్చి ఆ విషపూరితమైన కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు. తర్వాత దానిని ఓ సంచిలో వేసుకుని దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి అక్కడ విడిచిపెట్టాడు.
ఈ వీడియోను vishalsnakesaver అనే ఇన్ స్టా పేజీలో షేర్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకు వేలల్లో లైక్స్, వందల కామెంట్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ మధ్య స్నేక్ వీడియోలే తెగ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియోలను నెటిజన్స్ బాగా ఆదరిస్తారు. దాని తగ్గట్టే కొన్ని వందల వీడియోలు రోజూ సామాజిక మాధ్యమాల్లో డంప్ అయి వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం వానలు అధికంగా పడుతుండటంతో మన చుట్టూ పక్కల ఓ కన్నేసి ఉంచాలి. ఏ పాము ఎలా దూరుతుందో ఎవరికీ తెలియదు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఇంటిని క్లీన్ చేసుకోవాలి. ఈ పాముల వల్ల ఒక్కోసారి మన ప్రాణాలే పోవచ్చు, కాబట్టి ఏమరపాటు ఏమాత్రం తగదు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.