Girl Wrestling Viral Video: కుస్తీ పోటీ.. ఒకప్పుడు పురుషులకే పరిమితమైన ఈ ఆటలో ఇప్పుడు మహిళలు సైతం తమ పట్టును ప్రదర్శించి దేశానికి కీర్తిని సాధించి పెడుతున్నారు. రెజ్లింగ్ ఆధారంగా వచ్చిన సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. రెజ్లింగ్ అనగానే మొదటగా గుర్తొచ్చే సినిమా దంగల్.. గీతా ఫోగట్ తన చిన్నతనంలోనే కుస్తీ పోటీలో అబ్బాయిలతో పోటీని ప్రదర్శించిన తీరు విజిల్స్ వేయిస్తుంది. ఇప్పుడు అదే సీన్‌ను గుర్తు చేసేలా ఓ చిన్నారి.. అవలీలగా ఓ పురుషుడిని ఓడించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: https://teluguprabha.net/viral/customer-compliments-to-blinkit-delivery-boy-viral-post/
ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే సమాచారం లేదు. కానీ వీడియోను పరిశీలిస్తే ఓ గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నారు. కండలు తిరిగిన ఆటగాళ్లు తమ బలాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి ఎరీనా(కుస్తీ జరిగే ప్రదేశం)లోకి దిగుతుంది. వచ్చీ రాగానే పోటీ మొదలుకాగానే ఓ పాటకు హుషారైన స్టెప్స్ వేసి.. వెంటనే పోటీలో దిగిన వ్యక్తిని సునాయాసంగా గాల్లోకి విసిరేస్తుంది. అలా రెండు సార్లు ఆ చిచ్చరపిడుగు చేతిలో పట్టు వదిలిపోయిన ఆ వ్యక్తి దెబ్బకి.. రింగ్ వదిలి పారిపోతాడు. అక్కడున్న జనం అంతా ఆ చిన్నారి పట్టు చూసి ఆశ్చర్యంతో విజిల్ వేస్తుంటారు. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్‌ను సంపాదించుకుంది.
అయితే ఈ వీడియోపై భిన్న రకాల కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ముందుగానే ప్లాన్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇలా వీడియో చేస్తారని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు చిచ్చరపిడుగు అంటూ చిన్నారిని పొగడ్తలతో ముంచేస్తున్నారు. సరదాకి తీసినా, మరేదైనా కారణమైనా.. పదేళ్లు కూడా నిండినా చిన్నారి.. కండ పుష్ఠి ఉన్న పురుషుడిని తన భుజాలపై నుంచి ఎత్తేయడం అనేది సాధారణమైన విషయం కాదు కదా.. మీరూ ఓ సారి ఆ వీడియోపై లుక్కేయండి.
Dangal Movie irl (The wrestler lost to a little girl and then ran away) pic.twitter.com/nhVqvI3nu9
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 9, 2025


