Daughter Climbs up Cell Tower: పండుగలు వచ్చిందంటే చాలు.. ముందుగా గుర్తుచ్చేది, ముఖ్యంగా చేయాల్సిన పని ఇల్లు శుభ్రం చేయడం. లేదంటే ఏ పనీ తెమలదు. కనీసం రెండు రోజులైనా ఇల్లు క్లీనింగ్‌కి కేటాయించాల్సిందే. మరో రెండు రోజుల్లో దీపావళి పండుగ రానుంది. ఈ క్రమంలో ఇల్లు శుభ్రం చేయమని ఆ తల్లి కూతురికి చెప్పడమే తప్పయింది. ఆ కూతురు చేసిన పనికి తల్లే కాదు.. స్థానికులు కూడా ఖంగు తిన్నారు.
Also Read: https://teluguprabha.net/viral/deepavali-village-story-srikakulam-kings-gratitude-turned-into-name/
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో తల్లి ఇల్లు శుభ్రం చేయమన్నందుకు ఓ కూతురికి విపరీతంగా కోపం వచ్చింది. క్లీన్ చేయనని మారాం చేసింది. దీంతో తల్లి కూతురిని తిట్టింది. తల్లి తిట్లతో ఆగ్రానికి గురైన కూతురు సెల్ టవర్ ఎక్కి కూర్చుంది. కిందికి దిగనని.. దూకి చనిపోతానని బెదిరించింది. దీంతో తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
मिर्जापुर में एक युवती को उसकी माँ ने दीपावली पर साफ सफाई को लेकर फटकार लगाई थी, युवती गुस्से में मोबाइल टावर पर चढ़ गयी और ड्रामा किया…#Mirzapur #Video #VideoViral #LiveVideo pic.twitter.com/TdEszqODWi
— Gaurav Kumar (@gaurav1307kumar) October 17, 2025
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడికి వచ్చి, యువతికి నచ్చజెప్పి కిందికి దిగేలా చేశారు. ఆ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆమెను మళ్లీ కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. కాగా, ఈ ఘటనపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంటి పనులు కేవలం అమ్మాయిలు మాత్రమే చేయాలని కాదని.. అబ్బాయిలతో కూడా చేయించాలని సూచించారు. ఆడా, మగా బేధం చూపకుండా అందరూ సమానంగా పనులు పంచుకోవాలని హితవు పలికారు.


