Sunday, November 16, 2025
Homeవైరల్Chinese Public Toilet: చైనాలో టాయిలెట్ చూసేందుకు క్యూ కడుతున్న టూరిస్టులు!

Chinese Public Toilet: చైనాలో టాయిలెట్ చూసేందుకు క్యూ కడుతున్న టూరిస్టులు!

Chinese Public Toilet Becomes a Viral Tourist Attraction: పబ్లిక్ టాయిలెట్ అంటే మనకు సాధారణంగా ఏమనిపిస్తుంది? అదో అత్యవసర ప్రదేశం మాత్రమే. కానీ చైనాలోని ఓ పబ్లిక్ టాయిలెట్ ఇప్పుడు పెద్ద టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది. దానిని చూసేందుకు, అందులో ఫోటోలు దిగేందుకు జనం బారులు తీరుతున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి మరీ ఫోటోషూట్‌లు చేసుకుంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.

- Advertisement -

ALSO READ: Weight loss bonus: చైనా కంపెనీ వినూత్న ఆలోచన.. బరువు తగ్గితే బోనస్..!

చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో ఉన్న చారిత్రక సిల్క్ రోడ్ నగరం డున్‌హువాంగ్‌లో ఈ వింత చోటుచేసుకుంది. అక్కడి నైట్ మార్కెట్‌లో కొత్తగా పునరుద్ధరించిన ఈ టాయిలెట్‌ను ఇప్పుడు “డున్‌హువాంగ్ ప్యూర్ రియల్మ్ పబ్లిక్ కల్చరల్ స్పేస్” అని పిలుస్తున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన మొగావో గుహలకు ఈ నగరం ప్రసిద్ధి. ఆ చారిత్రక స్ఫూర్తితోనే ఈ టాయిలెట్‌ను నిర్మించారు.

 

View this post on Instagram

 

A post shared by China Exploring (@china__exploring)

ALSO READ: Viral Video: ఇంట్లోకి దూరిన భయంకరమైన పాము.. ఈ బుడ్డది ఎలా బయటకు పంపించిందో చూశారా?

రెండు అంతస్తుల ఈ భవనం బయట నుంచి చూస్తే ఏదో ఆర్ట్ గ్యాలరీలా కనిపిస్తుంది. లోపలి గోడలపై డున్‌హువాంగ్ సంస్కృతికి ప్రతీకగా నిలిచే అద్భుతమైన కుడ్యచిత్రాలు (murals) గీశారు. పై అంతస్తును ‘ఫాంటసీ ప్రపంచం’ థీమ్‌తో డిజైన్ చేశారు. ఇందులో తల్లీబిడ్డల కోసం ప్రత్యేక గది, సీటింగ్ ఏరియాలు, డ్రింక్ డిస్పెన్సర్లు వంటి ఆధునిక సౌకర్యాలున్నాయి.

అంతేకాదు, ఓ వ్యక్తి స్టాల్‌లోకి వెళ్లిన తర్వాత ఎంతసేపు లోపల ఉన్నాడో బయట స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఐదు నిమిషాలు దాటితే ఆ డిస్‌ప్లే రంగు మారి హెచ్చరిస్తుంది. ఆగస్టు 16న ప్రారంభమైన ఈ టాయిలెట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. “నేను పొరపాటున ఏదో గుహలోకి వచ్చానేమో అనుకున్నాను” అని ఓ మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేసిందంటే దీని అందాన్ని అర్థం చేసుకోవచ్చు.

ALSO READ: Viral Video: మెట్రో ట్రైన్ లో నిద్రలోకి జారుకున్న తల్లి.. పక్కనే ఉన్న చిన్నారి బాలుడు ఏం చేశాడో తెలుసా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad