Train Accident CCTV video Noida: ‘ఒక్క 2 నిమిషాలు ఆగితే ఏమైంది బ్రో.. ప్రాణాలతో ఉండేవాడివి కదా.. హాయిగా మీ ఇంట్లో వాళ్లతో సంతోషంగా ఉండేవాడివి కదా..’. ‘రైల్వే క్రాసింగ్ వద్ద గేటు క్లోజ్ చేసి ఉన్నా అలా ఎలా నిర్లక్ష్యంగా వెళ్తావ్?’ అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన జనాలంతా. క్షణకాలంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయంతో అతని ప్రాణాలు ట్రైన్ కింద నుజ్జునుజ్జయిపోయాయి. గ్రేటర్ నోయిడాలో ఓ ట్రైన్ యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లో గ్రేటర్ నోయిడాలోని బోడాకి రైల్వే క్రాసింగ్ వద్ద ఆదివారం సాయంత్రం రైలు వస్తున్న సమయంలో గేటు మూసివేసి చేసి ఉంది. అయితే ఇదేమీ పట్టించుకోకుండా బైక్‌పై రోడ్డు దాటేందుకు వ్యక్తించిన ఓ యువకుడు రైలు కింద పడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తుషార్ అనే యువకుడు బైక్‌పై వస్తూ బోడాకి రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు దాటేందుకు యత్నించాడు. కాగా, తుషార్ అంతలోనే రైల్వే పట్టాల మీద స్కిడ్ అవడంతో బైక్‌తో పాటు అతను కూడా కిందపడ్డాడు. అప్పటికే అటు నుంచి రైలు వేగంగా రావడంతో.. తుషార్ ముందుకు పరిగెత్తకుండా బైక్ తీసుకునేందుకు పట్టాల మీదికి వెళ్లాడు.
Also Read: https://teluguprabha.net/viral/girl-makes-reel-at-crematorium-video-sparks-outrage-online/
అంతలోనే ట్రైన్ దగ్గరగా రావడంతో భయపడిన తుషార్.. కంగారులో పట్టాల నుంచి తప్పుకోకుండా ముందుకు వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా రైలు.. తుషార్, బైక్ మీదుగా వేగంగా వెళ్లిపోయింది. ఘటనలో తుషార్ అక్కడిక్కడే చనిపోయాడు. కాగా, మరో నెలరోజుల్లో తుషార్ వివాహం జరగాల్సి ఉంది. ఘటనతో తుషార్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇలా నిర్లక్ష్యంగా వహించడంతో అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.


