Tribal Woman Finds Diamonds: మధ్యప్రదేశ్ లో ఓ గిరిజన మహిళకు అదృష్టం వరించింది. ఒకటి కాదు.. రెడు కాదు.. ఏకంగా మూడు వజ్రాలు ఆమెకు దొరికాయి. పన్నా జిల్లాలో స్థానిక గనిలో పనిచేస్తున్న ఒక గిరిజన మహిళ అనేక లక్షల రూపాయల విలువైన మూడు వజ్రాలను సేకరించినట్టుగా సంబంధిత ఒకరు అధికారి తెలిపారు. రాజ్‌పూర్‌కు చెందిన వినీతా గోండ్ తాను లీజ్‌కు తీసుకున్న పటీ గని ప్రాంతంలో మూడు వజ్రాలను కనుగొన్నారు. వీటిలో ఒకటి 1.48 క్యారెట్లు, మిగతావి 20, 7 సెంట్ల బరువు ఉన్నట్టుగా చెప్పారు.. మూడు వజ్రాల్లో ఒకటి అత్యుత్తమ నాణ్యత కలిగిందని జిల్లా అధికారి అనుపమ్ సింగ్ తెలిపారు. “మహిళ భర్త మూడు వజ్రాలను డిపాజిట్ చేయడానికి కార్యాలయానికి వచ్చాడు. వాటిని వజ్రాల వేలంలో ఉంచుతాం” అని ఆయన చెప్పారు.ఈ వజ్రాలను త్వరలో వేలం వేస్తామని పన్నా వజ్ర అధికారి అనుపమ్ సింగ్ తెలిపారు. అంతేకాకుండా, మునుపటి సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది వజ్రాలను తక్కువగా గుర్తించామన్నారు. వివిధ తవ్వకాల ద్వారా 47 వజ్రాలు కనుగొన్నామన్నారు. అవన్నీ వేలం కోసం పన్నా డైమండ్ ఆఫీసులో జమ చేశామన్నారు. అందులో అత్యంత బరువైనది 11.95 క్యారెట్ల బరువుగా ఉందన్నారు.
Read Also: Bigg Boss New Captain: ఆమె కోరింది.. అతడు చేశాడు.. ప్రేమ జంట పంట పండింది.. కెప్టెన్ గా డీమాన్ పవన్
అత్యధిక నాణ్యత కలిగిన వజ్రం
ఈ మూడు వజ్రాలలో ఒకటి రత్న నాణ్యత కలిగి ఉందని ఆ అధికారి చెప్పారు. ఇది చాలా అధిక నాణ్యత కలిగినదిగా వెల్లడించారు. మిగిలిన రెండు కొంచెం తక్కువ నాణ్యత కలిగినవిగా అధికారి తెలిపారు. పన్నా జిల్లాలోని రాజ్‌పూర్‌కు చెందిన ట్రయల్ నివాసి వినితా గోండ్, వజ్రాల కార్యాలయం నుండి లీజు పొందిన తర్వాత తన సహచరులతో కలిసి పాటి ప్రాంతంలో ఒక గనిని స్థాపించారని సింగ్ చెప్పారు. గతంలో ఇక్కడ ఒకేసారి ఎక్కువ వజ్రాలు దొరికిన సంఘటనలు కూడా ఉన్నాయి. జూలై 2025లో కూడా ఒక కార్మిక జంట మధ్యప్రదేశ్ గనిలో ఎనిమిది వజ్రాలను కనుగొన్నారు. ఛత్తర్‌పూర్ జిల్లాకు చెందిన ఈ జంట స్థానిక గని నుండి 10 నుండి 12 లక్షల రూపాయల విలువైన కనీసం ఎనిమిది వజ్రాలను కనుగొన్నారు. ఇకపోతే, మధ్యప్రదేశ్ లో తొలిసారిగా ఇ- వేలం ద్వారా సింగ్రౌలిలోని చకారియా గోల్డ్ బ్లాక్ బంగారు మైనింగ్ లీజు (పట్టా) ప్రక్రియ జరిగింది. చకారియా గోల్డ్ బ్లాక్ 23.57 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ బ్లాక్‌లో దాదాపు 1,33,785 టన్నుల బంగారు ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని, దాదాపు 176. 6 కిలోల బంగారం రికవరీ సాధ్యమని అందరూ నమ్ముతారు.
Read Also: Madonna Sebastian: మత్తెక్కించేలా మడోన్నా సెబాస్టియన్.. చీరకట్లో భలేగా ఉంది


