Railway Staff Fight on Platform: రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై సిబ్బంది విచక్షణా రహిత ప్రవర్తన ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది. స్టేషన్‌లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూస్తూ ప్రయాణికుల అవసరాలను తీర్చాల్సిన సిబ్బంది.. తమ బాధ్యతలు మరిచి ఒకరిపై ఒకరు పరస్పర దాడికి దిగారు. డస్ట్‌బిన్‌లు, బెల్టులతో పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: https://teluguprabha.net/national-news/72-year-old-woman-donates-kidney-to-save-sons-life-in-indore/
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో విధులు నిర్వహిస్తున్న పలువురు సిబ్బంది పరస్పరం దాడికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్‌కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరడానికి ముందు చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రయాణికులకు ఆందోళన కలిగించింది. ఇలాంటి ఉద్యోగుల వల్ల భారతీయ రైల్వే ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు రైల్వే శాఖలో పనిచేయడానికి అర్హులు కాదని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
IRCTC staffers serving onboard Vande Bharat settle an altercation with dustbin, belt and punches at Nizamuddin station in Delhi. pic.twitter.com/tldenRsRMz
— Piyush Rai (@Benarasiyaa) October 17, 2025
1.19 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో సుమారు ఆరు నుంచి ఎనిమిది మంది పరస్పరం దాడి చేసుకోవడం కనిపిస్తుంది. ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు చూస్తుండగానే.. కొందరు బెల్టుతో మరొకరిని కొట్టగా, ఇంకొంతమంది అక్కడే ఉన్న చెత్తబుట్టలను తోటి ఉద్యోగుల పైకి విసిరి నానా రచ్చ చేశారు. ఘటనలో ఉద్యోగులు కిందపడిపోవడం కూడా చూడవచ్చు. గొడవను ఆపేందుకు రైల్వే రక్షణ దళం సిబ్బంది వచ్చినప్పటికీ సద్దమణగలేదు. ప్రయాణికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.


