Variety love story: ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు చాలా మంది. అది నిజమే అనిపిస్తుంది ఈ ప్రేమ జంటను చూస్తుంటే. జపాన్ లో చెందిన ఓ 23 ఏళ్ల యువకుడు 83 ఏళ్ల మహిళతో ప్రేమలో పడ్డాడు. అమ్మమ్మ వయసు ఉన్న మహిళతో లవ్ లో పడటం ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.
ప్రేమ కథ ఎలా మెుదలైందంటే..
జపాన్ పిల్లగాడు కోపు గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. అతను ఒక రోజు తన క్లాస్ మేట్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఐకో అనే 83 ఏళ్ల మహిళను కలిశాడు. విచిత్రం ఏంటంటే వారి ఇరువురూ తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. ఇలాంటివి ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాం, కానీ నిజంగా జరిగే సరికి అందరూ అవాక్కువుతున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 60 ఏళ్లు ఉండటంతో వారు తమ మనసులోని భావాలను బయటకు వ్యక్తపరచలేదు.
తొలుత ఎవరు ప్రపోజ్ చేశారంటే..
కోపు, ఐకో మరియు ఆమె మనవరాలు డిస్నీల్యాండ్‌కు వెళ్లాలనుకున్నారు. అయితే సడన్ గా ఐకో మనవరాలు వెళ్లకుండా ఆగిపోయింది. అయితే కోపు, ఐకోలు డిస్నీల్యాండ్‌కు చేరుకున్నారు. ఇక్కడ కోపు తన మనసులోని మాటను బయటపెట్టాడు. సిండ్రెల్లా కోటకు ఎదురుగా ఐకోకు లవ్ ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ఓకే చెప్పడంతో ఈ జంట రాత్రికిరాత్రే ఫేమస్ అయిపోయింది. ఇరువురి వివాహానికి వారి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. అయితే ఐకోకు ఇది వరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తెతోపాటు ఐదుగురు మనవరాళ్లు కూడా ఉన్నారు.
Also Read: Snake on Bridge- వంతెనపై తిష్ట వేసి పడగ విప్పి కూర్చున్న భారీ నాగు పాము.. వైరల్ గా మారిన వీడియో..
రీసెంట్ గా ఈ జంట ఓ ఇంటర్వ్యూలో తమ సంబంధం గురించి బయటపెట్టారు. ఐకో ముఖం చూడనిదే నాకు రోజు ముగియదని కోపు.. అతడి కోసం వంట చేయడానికి తాను ఇష్టపడతానని ఐకో తమ గురించి చెప్పుకున్నారు. కోపు రాత్రి నిద్రపోయే ముందు బ్రష్ చేస్తాడని ఆమె నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం ఈ వెరైటీ ప్రేమ కథ విని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిజమైన ప్రేమకు అర్థం చెప్పారని వారిని పొగుడుతున్నారు. మెుత్తానికి ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also Read: Viral video -నీలి రంగు గుడ్లను పెడుతున్న నాటు కోడి.. షాక్ లో నెటిజన్స్..


