Tamil Nadu love story: ప్రేమకు సరిహద్దులు మాత్రమే కాదు లింగభేదం కూడా అడ్డురాదని ఓ ప్రేమజంట నిరూపించింది. ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి హిజ్రా అని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నాడు. ఈ వింత ఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే..
సేలం జిల్లా తారమంగళం సమీపంలోని ఓమలూర్‌కు చెందిన శరవణ కుమార్ (32) స్థానికంగా ఉన్న ఓ దుస్తులు తయారీ సంస్థలో పనిచేస్తున్నాడు. అదే వస్త్ర సంస్థలో సరోవ (30) అనే హిజ్రా కూడా పనిచేస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమకు దారితీసింది. శరవణ కుమార్ ప్రపోజ్ చేయగా సరోవ ఓకే చెప్పింది. ఈ జంట తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పి ఒప్పించారు.
Also Read: King Cobra -డబ్బుకు కాపలా కాస్తున్న మూడు అరుదైన నాగు పాములు.. వీడియో ఇదిగో!
వీరిద్దరి వివాహం ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయంలోని పెరియార్ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకను ద్రావిడ కళగం జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది మునియప్పన్ ముందుండి నడిపించారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరై ఆశీర్వదించారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో యువకుడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో కూడా..
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పెళ్లిళ్లు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పింకీ అనే హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరిగింది. అప్పట్లో ఈ వార్త తెగ వైరల్ అయింది.


