Venomous Cobra Snake Romance with women: ఇటీవల కాలంలో పాముల వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. తెల్లవారు లేచింది మెుదలు ఇంటర్నెట్ లో ఎక్కడ చూసిన ఈ స్నేక్ వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఈ వీడియోలను నెటిజన్స్ ఎగబడి మరీ చూస్తున్నారు. కొంత మంది పాములు, కొండచిలువలను పెంచుకోవడం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా వాటితో ఆటలు ఆడుతూ సందడి చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియోలోకి వెళ్తే.. ఇందలో ఓ మహిళ డేంజరస్ కింగ్ కోబ్రాను తనతోపాటు బెడ్ మీద ఉంచుకుంటుంది. అంతేకాకుండా ఆ నల్లత్రాచు తన లవర్ తో రొమాన్స్ చేసినట్లు ఆ మహిళ ముఖం మీద పాకుతూ సందడి చేస్తుంది. పాము ఆమెపై నుంచి పాకుతున్న ఆ లేడీ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా ఆ స్నేక్ ను తన చేతిలోకి తీసుకుని ఇష్టమెుచ్చినట్లు ఆడుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. దీనిపై లైక్స్, కామెంట్స్ వర్షం కూడా కురుస్తోంది. అది పొరపాటున కాటు వేస్తే మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసు కదా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
View this post on Instagram
వానకాలంలో పాములు జనావాసాల్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ నక్కి ప్రజలను భయాందోళకు గురిచేస్తాయి. ప్రతి ఏటా పాము కాటుకు ఎంతో మంది బలవుతున్నారు. పాముల్లో ప్రమాదకరమైనవి కింగ్ కోబ్రాలే. ఇవి ఒక్కకాటుతో మనిషి ప్రాణాలను తీయగలవు. ఈ డేంజరస్ స్నేక్స్ మన దేశంలో ఎక్కడపడితే అక్కడ కనబడుతూనే ఉంటాయి. సర్పాలు మిమ్మల్ని కాటువేసిన వెంటనే సొంత వైద్యం చేయకుండా.. దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లండి. ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉంటే తరుచూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి.


