Horrifying Moment Brazil Journalist: బ్రెజిల్‌లో ఒక భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.13 ఏళ్ల తప్పిపోయిన పాఠశాల విద్యార్థిని అదృశ్య ఘటనను కవర్ చేస్తూ..నదిలోకి దిగిన ఓ రిపోర్టర్ కు ఊహించని అనుభవం ఎదురైంది. అతడు నీటి లోతును చూపిస్తున్న సమయంలో అతడు అనుకోకుండా బాలిక మృతదేహంపై అడుగు వేశాడు. ఈ షాకింగ్ సంఘటన ఈశాన్య బ్రెజిల్‌లోని బకాబల్‌లోని మెరిమ్ నది వద్ద జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
అసలేం జరిగిందంటే..
జూన్ 29న రైస్సా అనే బాలిక తన స్నేహితులతో కలిసి మెరిమ్ నది వద్దకు ఈతకు వెళ్లి మునిగిపోయింది. ఆ చిన్నారి కోసం ఎంత గాలించిన కనిపించలేదు. ఈ క్రమంలో ఘటనను కవర్ చేసేందుకు వెళ్లాడు జర్నలిస్ట్ లెనిల్డో ఫ్రజావో. దీనిలో భాగంగానే అతడు మెరిమ్ నదిలోకి దిగారు. నీరు ఛాతి వరకు ఉన్న ప్రాంతంలో నడుస్తూ..రెస్సా ఈత కొట్టిన ప్రాంతాన్ని ఆడియెన్స్ కు చూపిస్తున్నాడు. ఇంతలో ఆకస్మాత్తుగా అతని కాలుకు నీటి అడుగున ఏదో తాకినట్లు అనిపించింది. ఆ విషయాన్ని తన బృందంతో చెప్పాడు. అది ఒక చేయిలా అనిపించింది..ఆమెదా లేక చేపదా అనేది తెలియట్లేదు. నేను నీటిలోకి మళ్లీ వెళ్లను భయంగా ఉంది అంటూ వెనక్కి రావడం వీడియోలో చూడొచ్చు.
Brazilian journalist discovers body of missing 12yo girl while filming report about her disappearance pic.twitter.com/73ygG2tGYh
— RT (@RT_com) July 21, 2025
ఫ్రజావో అనుమానమే నిజమైంది. జూన్ 30న అగ్నిమాపక సిబ్బంది మరియు డైవర్లు తప్పిపోయిన రెస్సా నిర్వహించిన అన్వేషణలో ప్రజావో నిలబడిన చోటనే రెస్సా మృతదేహం లభించింది. ఆమె మరణానికి కారణం ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడమేనని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. శారీరకంగా ఎటువంటి గాయం కాలేదు. జూన్ 30 సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరిగాయి. పాఠశాల ఆ చిన్నారి గౌరవార్థం మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. అంతేకాకుండా ఆమె స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు రెస్సా జ్ఞాపకార్థం ప్రార్థనలు చేసి, కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించారు.


