Man follows ChatGPT diet advice: ఇటీవల కాలంలో టెక్నాలజీ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే దీని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు మనకు ఏదీ కావాలన్నా గూగుల్ లో సెర్చ్ చేసి సమాచారం తెలుసుకునే వాళ్లం, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)వచ్చాక దానిని వాడటం మెుదలుపెట్టాం. అయితే ఈ ఏఐలో చాట్‌జీపీటీ, జెమిని, మెటా, పెరప్లెక్స్సిటీ, కో-పైలట్ వంటి వాటిని పలు కంపెనీలు అభివృద్ధి చేశాయి. ఈ క్రమంలో వినియోగదారులు కూడా వీటిని స్వేచ్ఛగా వాడేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి చాట్‌జీపీటీ సలహా తీసుకుని ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.
న్యూయార్క్ నగరానికి చెందన 60 ఏళ్ల వ్యక్తి తన ఆహారం నుండి ఉప్పు (సోడియం క్లోరైడ్)ను ఎలా తొలగించాలో చాట్‌జీపీటీ ని అడిగాడు. అది సాల్ట్ కు బదులు సోడియం బ్రోమైడ్ ను ఉపయోగించమని సలహా ఇచ్చింది. దాంతో అతడు సోడియం బ్రోమైడ్‌ను కొనుగోలు చేసి.. మూడు నెలల పాటు ఉప్పుకు బదులుగా తన పుడ్ లో వాడాడు. ఆ సమయంలో అతడు డాక్టర్లు సలహా తీసుకోలేదు. దీంతో అతడు అనారోగ్యానికి గురయ్యాడు. అయితే సోడియం బ్రోమైడ్ ను విషపూరితమైనదిగా పరిగణిస్తారు.
Also Read: King Cobras – ఓరి దేవుడా! ఒకే చోట ఇన్ని నాగుపాములా..!
సోడియం బ్రోమైడ్ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తిలో చాలా మార్పులు కనిపించాయి. మానసిక ఆందోళన, తీవ్రమైన భయం, అధిక దాహం వంటి అనేక లక్షణాలు కనిపించడం మెుదలుపెట్టాయి. రోజురోజూకు అతడి ఆరోగ్య పరిస్థితి దిగజారింది. అతడిని పరీక్షించిన వైద్యులు ఆ వ్యక్తి శరీరంలో అధికమెుత్తంలో బ్రోమైడ్ స్థాయిలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించిన డాక్టర్లు అతడిని సాధారణ స్థితికి తీసుకురావడానికి మూడు వారాలు పెట్టింది. ఆ వ్యక్తి బాడీలోని సోడియం, క్లోరైడ్ స్థాయిలు సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఈ కేసు అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఆరోగ్య విషయాల్లో వైద్యుడి సలహా తీసుకుండా ఏఐ సలహా పాటించడం ప్రమాదకరమని తాజా ఘటన స్పష్టం చేసింది.
Also Read: Viral video- ఎలా వస్తాయమ్మ ఇలాంటి ఐడియాలు! బెడ్ రూమ్ లో బల్లుల్ని పెంచుకుంటున్న యువతి, వీడియో వైరల్


