Haryana shocking incident: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే అమానుషంగా ప్రవరిస్తున్నారు. చిన్న పిల్లలనీ కనికరం కూడా లేకుండా వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సరిగ్గా చదవని విద్యార్థులను టీచర్స్ దండించడంలో తప్పులేదు. అంత మాత్రాన ఇష్టమెుచ్చినట్లు వారి పట్ల వ్యవహారించమని కాదు. హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణాన్ని చూపి రెండో తరగతి విద్యార్థిని తలకిందులుగా వేలాడదీసి చావబాదిన ఘటన హర్యానాలోని పానిపట్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..
పానిపట్‌లో ముఖిజా కాలనీకి చెందిన డోలీ అనే మహిళ తన ఏడేళ్ల కుమారుడిని జట్టల్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో చేర్పించింది. హోంవర్క్ పూర్తి చేయలేదనే కారణంతో ప్రిన్సిపాల్ రీనా, స్కూల్ డ్రైవర్ అజయ్ తన కొడుకు పట్ల దారుణంగా ప్రవర్తించారని డోలీ ఆరోపించారు. ప్రిన్సిపాల్ ఆదేశించడంతో డ్రైవర్ అజయ్ బాలుడిని చూడకుండా తన కుమారుడిని తాళ్లతో కట్టి కిటికీకి తలక్రిందులుగా వేలాడదీసి చితకబాదారని ఆమె తెలిపారు. పైగా అతడు నా కొడుకును కొడుతూ తన స్నేహితులకు వీడియో కాల్స్ చేసి మరీ పైశాచిక ఆనందం పొందాడు. ఈ ఘటనను వీడియోగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త విద్యార్థి ఫ్యామిలీ మెంబర్స్ కు చేరింది.
ప్రిన్సిపాల్ వివరణ..
ఈ విషయంపై ప్రిన్సిపాల్ ను నిలదీయగా.. బాలుడిని మందలించమని మాత్రమే డ్రైవర్ కు చెప్పానని ఆమె తెలిపింది. అజయ్ ప్రవర్తన సరిగా లేదని ఫిర్యాదులు అందడంతో అతడిని ఆగస్టులోనే పనిలో నుండి తెలిగించినట్లు ఆమె వివరణ ఇచ్చింది. అయితే వీడియో వైరల్ అయిన తర్వాత అజయ్ కొంత మంది వ్యక్తులను తమ ఇళ్లకు పంపి బెదిరిస్తున్నాడని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Also Read: Lovers romance-రన్నింగ్ మెట్రోలో ముద్దులు, హగ్ లతో రెచ్చిపోయిన ప్రేమ జంట.. వీడియో ఇదిగో!
మరో వీడియో బయటకు..
ఈ వీడియోతోపాటు ప్రిన్సిపాల్ రీనాకు సంబంధించిన మరో వీడియో కూడా బయటకు వచ్చింది. రీనా చిన్న పిల్లలని చూడకుండా ఇతర విద్యార్థుల ముందే కొట్టింది. ఈ ఘటనపై ఆమెను ప్రశ్నించగా బాలికలతో అమర్యాదగా ప్రవర్తించినందుకే తల్లిదండ్రులకు చెప్పి మరీ వారిని శిక్షించమని తన చేసిన పనిని సమర్థించుకున్నారు. అయితే స్కూల్ లో శారీరక దండనను నిషేధిస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి.


