MP Viral news: మధ్యప్రదేశ్ లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రెండు లడ్డూలకు బదులుగా ఒక లడ్డూ మాత్రమే ఇచ్చారని ఓ వ్యక్తి సీఎం హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని నౌధా అనే గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే జెండా వందనానికి వచ్చిన ప్రజలకు ఒక్కొక్క లడ్డును ఇచ్చారు. ఈ విషయం స్థానిక వ్యక్తి అయిన కమలేష్ కుష్వాహా నిరుత్సాహం కలిగించింది. ప్రతి ఏటా రెండు లడ్డూలు పంచి.. ఈ సారి మాత్రం ఒక లడ్డూ ఇవ్వడం అతడిని నిరాశ పరిచింది. కమలేష్ అధికారులను అడగ్గా..వారు ఇంకో లడ్డూను ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో అతడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్ కు ఫోన్ చేసి గ్రామ సర్పంచ్, కార్యదర్శిపై ఫిర్యాదు చేశాడు.
Also Read: Viral Video -అడ్మిషన్ కోసం స్కూల్‌కు వెళ్లిన గున్న ఏనుగు.. ట్రెండింగ్ లో వీడియో..
అతడు చేసిన కంప్లైంట్ స్థానిక అధికారులను కలవరపెట్టింది. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు స్థానిక పంచాయతీ సిబ్బందికి ఫోన్ చేసి పరిస్థితిని నియంత్రించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీ అధికారులను మార్కెట్ నుంచి కిలో లడ్డూలను తెప్పించి.. కమలేష్ కు క్షమాపణలు చెప్పి లడ్డూలను అతడికి అందించారు.
Also Read: Viral video – అద్భుతం.. బంగారు నిధికి కాపలాగా దేవ నాగు.. వీడియో వైరల్..
ఆ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా జనాలకు కూడా ఒక్కోక్క లడ్డూను అందజేశారు. తద్వారా ఫిర్యాదు పరిష్కరించనట్లయింది. కుష్వాహా ఇప్పటివరకు సీఎం హెల్ప్‌లైన్ ద్వారా 107 ఫిర్యాదులు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కమలేష్ కు ఇలాంటి విషయాలపై తరుచూ స్పందిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు అతడు సీఎం హెల్ప్‌లైన్‌లో వివిధ సమస్యలపై వందకు పైగా ఫిర్యాదులు చేశాడని పంచాయతీ కార్యదర్శి వెల్లడించారు. ఏది ఏమైతేనేమి కుష్వాహా చేసిన పని సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.


