Sunday, November 16, 2025
Homeవైరల్Viral: మానవత్వం చాటుకున్న ముస్లిం యువకుడు.. హిందూ మహిళకు అంత్యక్రియలు నిర్వహించి..

Viral: మానవత్వం చాటుకున్న ముస్లిం యువకుడు.. హిందూ మహిళకు అంత్యక్రియలు నిర్వహించి..

- Advertisement -

Rajasthan Viral news: హిందూ-ముస్లిం బాయ్ బాయ్‘ అనడమే కాదు దాన్ని చేతుల్లో కూడా చేసి చూపించాడు ఓ ముస్లిం యువకుడు. ఓ హిందూ మహిళ చనిపోతే అన్నీ తానై చేసి..చివరకు కన్న కొడుకులా అంత్యక్రియలు కూడా నిర్వహించి ఇంకా మానవత్వం బతికే ఉందని నిరూపించుకున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన రాజస్థాన్‌లోని భిల్వారాలో చోటుచేసుకుంది. అంతేకాకుండా ఆమె చితా భస్మాన్ని త్రివేణీ సంగమ క్షేత్రంలో నిమజ్జనం చేస్తానని కూడా చెప్పాడు. అతడి చేసిన పనికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వస్తున్నాయి.

అసలేం జరిగిందంటే..

రాజస్థాన్‌లోని మనియారిలోని జంగి మొహల్లాలో 42 ఏళ్ల అస్గర్ అలీ నివసిస్తున్నాడు. అతడికి ఓ చిన్న దుకాణం కూడా ఉంది. అలీ ఇంటిపక్కనే 67 ఏళ్ల శాంతి దేవి నివాసం ఉంటుంది. ఈ సందర్భంగా అస్గర్ అలీ శాంతాదేవి కుటుంబం గురించి మాట్లాడాడు. శాంతా దేవి భర్త సంతల్లో చిన్న దుకాణాలు ఏర్పాటు చేసి జీవించేవాడని.. నా తల్లిదండ్రులు కూడా అదే పని చేసేవారని అలీ అన్నాడు. అలా మా ఇద్దరి కుటుంబాల మధ్య మూడు దశాబ్దాల కిందట పరిచయం ఏర్పడింది. 2010లో శాంతాదేవి భర్త మరణించగా..ఆమె తన కొడుకుతో కలిసి నివసించడానికి మా ఇంటికి పక్కకు వచ్చింది. మా రెండు ఫ్యామిలీస్ సలీం ఖురేషి ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లం. మా కుటుంబం మెుదటి అంతస్తులో ఉంటే.. శాంతాదేవి వాళ్లు గ్రౌండ్ ప్లోర్ లో ఉండేవారు.

Also Read: Viral video- ఓరేయ్ నాయనా.. అది ట్రైన్ రా.. ఓయో కాదురా? రన్నింగ్ ట్రైన్‌లో ముద్దులు, హగ్స్ తో రెచ్చిపోయిన ప్రేమ జంట..

కన్న తల్లిలా సాకేది..

2017లో మా నాన్న చనిపోతే శాంతాదేవి గారు నా తల్లికి అండగా నిలిచారు. నన్ను కన్న కొడుకులా చూసుకున్నారు. మరుసటి ఏడాది ఓ అడవి జంతువు దాడిలో శాంతాదేవి కుమారుడు మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఆమె మాతోనే జీవించడం మెుదలుపెట్టింది. రెండేళ్ల కిందట నా తల్లి కూడా కాలం చేసింది. అప్పటి నుంచే ఆమె నన్ను కన్నతల్లిలా చూసుకుంది. ఎంతో ప్రేమను పంచింది. నేను మాసి అని తనను పిలిచేవాడిని. నా భార్య కూడా చూసుకొని విధంగా నన్ను పట్టించుకునేది. మేము అన్ని పండుగలను కలిసే జరుపుకునే వాళ్లం. కొంత కాలంగా శాంత అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది.

Also Read: దేశ సేవకు బయలుదేరిన జవాన్.. – అమ్మ ఆత్మీయ వీడ్కోలు

ఆమె చనిపోవడం నాకు తీరని లోటు. అందుకే కొడుకుగా మారి ఆమెకు హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనని చెప్పాడు. ఆమె చివరి కోరిక మేరకు యాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో లేదా చిత్తోర్‌గఢ్‌లోని మాతృకుండియలో నిమజ్జనం చేస్తానని తెలిపాడు.

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad