Oxford Graduate Becomes Food Delivery Agent in China: ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించి, పీహెచ్‌డీ పూర్తి చేసిన ఓ యువకుడు సరైన ఉద్యోగం దొరక్కపోవడంతో పుడ్ డెలివరీ బాయ్ గా మారాడు. అతడే చైనాకు చెందిన డింగ్ యువాన్జావో. ఆశ్చర్యానికి గురి చేసే ఇతడి స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే..
చైనాకు చెందిన 39 ఏళ్ల డింగ్ యువాన్ఝావో యెుక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఆయన చైనాలోని ఫేమస్ సింఘువా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ, పెకింగ్ విశ్వవిద్యాలయం నుంచి ఎనర్జీ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అంతేకాకుండా సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి బయాలజీలో పీహెచ్‌డీ పట్టా పొందడంతోపాటు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ అయినఆక్స్ఫర్డ్ లో బయోడైవర్సిటీలో మరో డిగ్రీ కూడా సాధించారు. డింగ్ సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్‌గా కూడా పనిచేశాడు.
Also Read: King Cobra Bathing video- కింగ్ కోబ్రా స్నానం వీడియో
ఇంత చదువు చదివినా అతగాడికి సరైన ఉద్యోగం దొరకలేదు. ఎన్ని ఇంటర్వ్యూలకు హాజరైనా అక్కడ కూడా డింగ్ కు తీవ్ర నిరాశ మిగిలింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఉద్యోగం దొరక్కపోవడంతో విసుగు చెందినా అతడు చివరకు పుడ్ డెలివరీ రైడర్ గా మారాడు. ”ఇదేమీ చెడ్డపని కాదు. పుడ్ డెలివరీ చేయడం వల్ల నాకు స్థిరమైన ఆదాయం వస్తుంది. ఈ డబ్బుతో నా కుటుంబాన్ని పోషించగలుగుతున్నాను..ఎన్ని డిగ్రీలు ఉన్నా చాలా మంది చివరు ఇలాంటి పనుల్లోనే స్థిరపడుతున్నారని” డింగ్ చెప్పుకొచ్చాడు. పుడ్ డెలివరీతోపాటు సమాజ సేవ కూడా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.