Cyber Crime in pune: దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు వినూత్న పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో అమాయక ప్రజల డబ్బును కాజేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో వచ్చిన ఒక మోసపూరిత ప్రకటనను నమ్మి ఏకంగా రూ. 11 లక్షలు పోగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఒక మహిళ తనను గర్భవతిని చేయగల ఆరోగ్యవంతుడైన మగాడు కావాలని, అందుకు రూ. 25 లక్షల రూపాయల నగదు ఇస్తానని ప్రకటించింది. ఆసక్తి గలవారు కాల్ చేయాలని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. ఈ అదిరిపోయే ఆఫర్ చూసిన ఓ 44 ఏళ్ల కాంట్రాక్టర్ వెంటనే ఆ నెంబర్‌కు కాల్ చేశాడు.
అతడు ఫోన్ చేస్తే ఓ వ్యక్తి లిఫ్ట్ చేశాడు. తమది ప్రెగ్నెంట్ జాబ్ సంస్థ అని, తాను అసిస్టెంట్‌గా పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. మహిళతో కలిసేందుకు ముందుగా తమ సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, దానికి ఐడెంటిటీ కార్డు తీసుకోవాలని కాంట్రాక్టర్ కు సూచించాడు. ఈ క్రమంలో వారు రిజిస్ట్రేషన్ ఫీజు, ఐడెంటిటీ కార్డు ఫీజు, జీఎస్టీ, టీడీఎస్, ప్రాసెసింగ్ ఫీజు వంటి రకరకాల ఛార్జీల పేరుతో కాంట్రాక్టర్ దగ్గర నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. ఆ మోసగాళ్లు కాంట్రాక్టర్ దగ్గర నుండి దాదాపు రూ. 11 లక్షల వరకు కాజేశారు.
Also Read: Bike Romance – రోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. రన్నింగ్ బైక్ పై రాసలీలలు చేస్తూ..
ఇంత డబ్బు పంపినా తన పని పూర్తి కాకపోవడంతో అతడికి డౌట్ వచ్చింది. దీంతో బాధితుడు వారిని నిలదీయడంతోపాటు ప్రశ్నించడం ప్రారంభించాడు. వెంటనే నేరగాళ్లు కాంట్రాక్టర్ నెంబర్ బ్లాక్ చేశారు. అప్పుడు తాను మోసపోయానని అతడు గ్రహించి కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ విషయంపై కాంట్రాక్టర్ పుణేలోని బనేర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మెుత్తం దందా బీహార్‌లోని నవాదా జిల్లా కేంద్రంగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి నకిలీ ఆఫర్ల, ఆన్‌లైన్ ప్రకటనల చూసి మోసపోవద్దని హెచ్చరించారు.


