Saturday, November 15, 2025
Homeవైరల్viral reels: సోషల్​ మీడియా పిచ్చి పీక్స్.. రీల్స్‌ మోజులో యువత పిచ్చి ఆగడాలు!

viral reels: సోషల్​ మీడియా పిచ్చి పీక్స్.. రీల్స్‌ మోజులో యువత పిచ్చి ఆగడాలు!

Dangerous stunt for Instagram Reels: ప్రస్తుత కాలం సోషల్ మీడియా యుగం. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోవచ్చు. చాలా మంది ఎక్కువ ఫాలోవర్లను సంపాదించుకుని.. ప్రమోషన్ల ద్వారా డబ్బు సంపాదించవచ్చని భావిస్తున్నారు. అందుకోసం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి, ఫాలోవర్లను సంపాదించుకోవడానికి యువత ప్రాణాలను పణంగా పెడుతోంది. రైళ్ల కింద పడుకోవడం, వేగంగా వెళ్లే రైళ్ల పక్కన నడవడం అలాగే నదుల్లోకి దూకడం వంటి ప్రాణాంతకమైన పనులు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఒక ఆందోళన కలిగించే వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కొందరు యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతూ రీల్స్‌ షూట్‌ చేయడం కనిపిస్తుంది.

- Advertisement -

వంతెనపై ప్రాణాంతక రీల్ షూటింగ్: వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొందరు యువకులు వంతెనపై ఒక ప్రమాదకరమైన స్టంట్‌ను చేస్తున్నారు. ఒక అబ్బాయిని తలకిందులుగా వేలాడదీయడానికి అతని కాళ్లకు తాడు కట్టారు. అతను కింద ఉన్న నదిలో మునిగిపోతున్నట్లు నటిస్తున్న ఒక అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తుంది. ఆ అమ్మాయి నది ప్రవాహంలో మునిగిపోతున్నట్లు నటిస్తుండగా.. పైనుంచి అబ్బాయి రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చిత్రీకరించారు.

Also Read:https://teluguprabha.net/viral/viral-muslim-son-performed-the-last-rites-of-his-hindu-mother-in-rajasthans-bhilwara/

ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువత: ఈ మొత్తం దృశ్యం ఒక రీల్ షూటింగ్ కోసం చేసినదే అని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ విన్యాసంలో పొరపాటున తాడు తెగినా లేదా నది ప్రవాహం పెరిగినా.. ఈ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉంది. ప్రాణాలు పణంగా పెట్టి చేస్తున్న ఈ పిచ్చి పనిని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ వీడియోను @ChapraZila అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇలాంటి ప్రమాదకరమైన రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు గుర్తించి కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad