Saturday, November 15, 2025
Homeవైరల్Tamil Nadu: కుర్రకారును సముద్రంలో ముంచేసిన 'గూగుల్ మ్యాప్'.. తర్వాత ఏం జరిగిందంటే..

Tamil Nadu: కుర్రకారును సముద్రంలో ముంచేసిన ‘గూగుల్ మ్యాప్’.. తర్వాత ఏం జరిగిందంటే..

- Advertisement -

Tamil Nadu Viral: చెన్నైకి చెందిన ఓ ప్రేమ జంట, వారి ముగ్గురు స్నేహితులు కారులో విహార యాత్రకు బయలుదేరారు. ఆ సమయంలో ఓ యువకుడు తన ప్రియురాలు, ఫ్రెండ్స్ తో పందెం కట్టి.. గూగుల్ మ్యాప్స్ ను నమ్మి కారును సముద్రంలోకి పోనిచ్చాడు. ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే..

తమిళనాడు చెన్నైకు చెందిన ముగ్గురు యువకులు, ఇద్దరు యువతలు కారులో టూర్ కు బయలుదేరారు. ఇందులో ఓ ప్రేమ జంట కూడా ఉంది. వీరంతా మందు కొట్టి పుల్ పార్టీ మూడ్ లో ఉన్నారు. ఈ క్రమంలో వారి మధ్య మాటా మాటా పెరిగి పందెం దాకా వెళ్లారు. ఇందులో అమ్మాయి లవర్ అయిన వ్యక్తి మిగతా వారితో బెట్టింగ్ కట్టాడు. సముద్రం తీరం వెంబడి కారు వెళ్తుందని ఒకరు.. వెళ్లదని ఇంకొకరు వాదించుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న వారు బీచ్ ఒడ్డు నుంచి వెళ్లాలని నిర్ణయించుకుంటారు.

Also Read: Viral: – ఆ మహిళకు 60 రొట్టెలు తిన్నా ఆకలి తీరడం లేదు.. ఈ వింత రోగం ఎక్కడంటే?

ఈ క్రమంలో గూగల్ మ్యాప్ ను చూడగా.. అది కడలూరు ఓడరేవు నుంచి పరంగిపెట్టై వరకు సముద్రం ఒడ్డు మీదుగా వెళ్లొచ్చని చూపిస్తుంది. వెంటనే వారు తమ ఫ్లాన్ ను అమలుపరుస్తారు. హర్బర్ నుంచి కారును బీచ్ మీదుగా పోనిస్తారు. సోథికుప్పం ప్రాంతానికి రాగాన మద్యం మత్తులో ఉన్న యువకుడు ఆ వెహికల్ ను సముద్రంలో తీసుకెళ్తాడు. అలా వెళ్లిన కారు అలల మధ్య చిక్కుకుపోయి కదలకుండా ఉండిపోతుంది. దీంతో వారంతా నీటిలో ఉండిపోతారు. దీనిని గమనించి స్థానిక మత్స్యకారులు వెంటనే సముద్రంలోకి దిగి వారినీ సురక్షితంగా రక్షిస్తారు. అంతేకాకండా కూరుకుపోయిన కారును ట్రాక్టర్ల సాయంతో బయటకు తీస్తారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సెప్టెంబరు 11న జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గతంలో కూడా..

ఇటీవల రాజస్థాన్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని వాహనం నడిపి ప్రమాదంలో పడింది ఓ కుటుంబం. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. నలుగురిని స్థానికులు, పోలీసులు కాపాడారు. మ్యాప్స్ కారణంగా రెండేళ్లుగా మూసివేసిన బ్రిడ్జిపై నుంచి వెళ్లి వరద నీరు పోటెత్తడంతో వాహనం కొట్టుకోపోయింది.

 

 

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad