Thursday, July 10, 2025
Homeవైరల్Odisha viral: పిచ్చి పీక్స్... రీల్స్ కోసం ఈ బాలుడు ఎంతకు తెగించాడో తెలుసా?

Odisha viral: పిచ్చి పీక్స్… రీల్స్ కోసం ఈ బాలుడు ఎంతకు తెగించాడో తెలుసా?

Odisha school boys dangerous stunt in railway track : సోషల్ మీడియా మోజులో పడి యువత పిచ్చివాళ్లు అయిపోతున్నారు. రీల్స్ కు బానిసలుగా మారి లైక్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ పిచ్చి పిచ్చి లైక్స్, వ్యూస్ కోసం వారు తమ ప్రాణాలే రిస్క్ లో పెట్టి.. కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే ఒడిశాలోని బౌధ్ జిల్లాలో చోటుచేసుకుంది.

- Advertisement -

రీల్స్ కోసం ఓ బాలుడు ఎవ్వరూ చేయని రిస్క్ చేశాడు. ఏకంగా ఆ పిల్లవాడు రైలు పట్టాలపై పడుకుంటుండగా.. అతడి ఇద్దరు స్నేహితులను దానిని వీడియో తీస్తున్నారు. ఇంతలో ట్రైన్ ఆ బాలుడిపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో అతడికి ఎలాంటి చిన్న గాయం కూడా కాలేదు. అతడికి ఇంకా భూమ్మీద నూకలున్నాయనుకుంటా, లేకుండా ఏ మాత్రం అటు ఇటు అయినా ఆపిల్లాడి ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన పురునాపాణి రైల్వే స్టేషన్ సమీపంలోని దలుపాలి సమీపంలో జరిగింది. ఇక్కడ రీసెంట్ గానే రైలు సేవలు ప్రారంభించబడ్డాయి. ఈ ఘటనను రైల్వే అధికారులు సీరియస్ గా తీసుకుని.. ఆ ముగ్గురు అబ్బాయిలను ప్రశ్నిస్తున్నారు. ”బతుకుతాను ఊహించలేదు.. నా మిత్రులు పురిగొల్పడం వల్లే ఈ ప్రమాదకరమైన స్టంట్ చేశా..” అని రైలు పట్టాలపై పడుకున్న బాలుడు చెప్పాడు.

పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలాంటి పనులకు పాల్పడుతున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు మీద ఉంది. చిన్నారులు సోషల్ మీడియాకు బానిసలు కాకుండా వారు మెుదట్లో చర్యలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో రీల్స్ మోజులో పడి యూత్ చేస్తున్న విన్యాసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. వారి ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా వారు రిస్క్ లో పడేస్తున్నారు. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News