Homeవైరల్Viral Video: డ్రైవర్‌కు మూర్చ.. గాల్లోకి ఎగిరిన కారు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో మీ కోసం..!

Viral Video: డ్రైవర్‌కు మూర్చ.. గాల్లోకి ఎగిరిన కారు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో మీ కోసం..!

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే మన కళ్ల ముందు ప్రత్యక్ష అవుతుంది. నెట్టింట రోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే..మరికొన్ని ఆశ్యర్యానికి గురిచేస్తాయి. సినిమల్లో మాత్రమే కారు గాల్లోకి ఎగరడం చూసి ఉంటాం. కానీ అమెరికాలో నిజంగానే కారు గాల్లో చక్కెర్లు కొట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

- Advertisement -

యూఎస్ న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని సన్‌రైజ్ హైవే అత్యంత రద్దీగా ఉండే రోడ్లలో ఒకటి. తాజాగా ఈ రహదారి నుండి ఒక షాకింగ్ ఘటనకు వేదికైంది. ఇటీవల ఈ హైవేపై వెళ్తున్న కారు ఒక్కసారిగా గాల్లో ఎగిరి అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. రోడ్డులోని లైన్స్ ను సైతం సైతం దాటుకుంటూ గాల్లోకి ఎగిరింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సెప్టెంబరు 3 సాయంత్రం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి కారణం డ్రైవర్‌కు మూర్ఛ రావడమే. దాని కారణంగా డ్రైవర్ కారు బ్యాలెన్స్ కోల్పోయాడని స్థానికులు చెప్పారు. ఆ కారు గాల్లోకి జంప్ చేసి సన్‌రైజ్ హైవే ఆరు లేన్‌లను దాటి..అవతలి వైపుకు వెళ్లి చెట్టును ఢీకొట్టిందని వారు అంటున్నారు.

ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. డ్రైవర్ వయసు 70 ఏళ్ల ఉంటుందని సమాచారం. ఈ ఘటనలో మరే ఇతర వాహనం డ్యామేజ్ అవ్వలేదు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం తర్వాత డ్రైవర్‌ను చికిత్స కోసం సౌత్ షోర్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇది 2012 హోండా కారుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. డ్రైవర్ ప్రాణాలతో బయటపడటం ప్రజలను ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే వీడియో చూసినప్పుడు చాలా భయానకంగా ఉంది.

Also Read: Tamil Nadu -కుర్రకారును సముద్రంలో ముంచేసిన ‘గూగుల్ మ్యాప్’.. తర్వాత ఏం జరిగిందంటే..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News