Elephant Viral Video: జంతువుల జీవితాలంటేనే సవాళ్లతో నిండి ఉంటాయి. అర్బనైషన్ వల్ల అడవులు అంతరించిపోతున్నాయి. దీంతో, వన్యప్రాణుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. మానవ నివాసాల్లోకి వెళ్తున్నాయి. అంతేకాకుండా రోడ్డుపైనే ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్నాయి. అయితే, ఇలా రైలు పట్టాలపై తిరిగిన ఓ ఏనుగు గాయపడింది. కాగా.. గజరాజుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో దిగ్భ్రాంతి కలిగించడమే కాకుండా.. తీవ్ర భావోద్వేగానికి గురిచేసేలా ఉంది. ఈ వీడియోలో ఒక పెద్ద ఏనుగు రైలు ప్రమాదంలో చిక్కుకున్నట్లు కన్పించింది. ఆ తర్వాత పట్టాల పక్కన నొప్పితో కొట్టుమిట్టాడుతున్నట్లు కన్పించింది. ఆ విజువల్స్ హృదయ విదారకంగా ఉన్నాయి.
Read Also: Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ ఐదు తప్పులు అస్సలు చేయొద్దు
పట్టాలు దాటేందుకు ప్రయత్నించి విఫలం
ఏనుగులు రైళ్లను ఢీకొన్న ఘటనలు తరచుగా జరుగుతాయి. కొన్నిసార్లు అవి తీవ్రంగా గాయపడతాయి. కొన్నిసార్లు అవి అక్కడికక్కడే చనిపోతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో రైలును ఢీకొన్న తర్వాత ఏనుగు బాధతో విలవిలలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోలో ఏనుగు తీవ్ర గాయాలతో బాధపడుతోంది. అయినా సరే ట్రైన్ ట్రాక్ మీద నుంచి లేచి వెళ్లడానికి ప్రయత్నించింది. కానీ అడుగు ముందుకు వెయ్యలేకపోయింది. రెండు మూడు సార్లు పట్టాలు దాటే ప్రయత్నం చేసినప్పటికీ విఫలమైపోయింది. నిస్సహాయ స్థితిలో గజరాతు తీవ్రంగా బాధపడుతోంది. ఆ వీడియోను చూసిన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
Read Also: Triangle Love Story: ముక్కలైన కళ్యాణ్ గుండె.. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడినట్లేనా?
అయితే, ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో @Jimmyy__02 అనే యూజర్ షేర్ చేశారు. “మానవులు భూమిని మార్చారు. యంత్రాలను తీసుకువచ్చారు. కానీ, ఏనుగులు మాత్రం వాటికి తగినట్లుగా మారలేకపోయాయి. ఇప్పుడు ఆ పరిణామాలను ఆ ఏనుగు అనుభవిస్తున్నది” అనే క్యాప్షన్‌తో ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ 32 సెకన్ల వీడియోను వేలాది మందని వీక్షించారు. వందలాది మంది దీనిని లైక్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్లు తమ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలిపారు. మనం ఏనుగులను రక్షించడానికి ఎల్లప్పుడూ కృషి చేయాలని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ఈ మూగ జంతువులు మన కారణంగా బాధపడుతున్నాయన్నారు. ఈ వీడియో చూడడానికి చాలా బాధాకరంగా ఉందని ఒక యూజర్ కామెంట్ చేయగా.. ఇది చాలా విషాదకరమైన ఘటన అని మరొకరు అభివర్ణించారు.
मानव ने ज़मीन बदली मशीनें ले आया…
हाथी बदल न सके और अब वही इसकी सज़ा भुगत रहे हैं। pic.twitter.com/YrhJeLyPZN— JIMMY (@Jimmyy__02) October 2, 2025


