Female Doctor viral Video: ఇటీవల కాలంలో ఆస్పత్రిలో జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వైద్యులను దైవంగా కొలిచే మనదేశంలో కొంత మంది రోగులు డాక్టర్లతో ప్రవర్తిస్తున్న తీరు వివాదస్పదమవుతోంది. తాజాగా ఓ లేడీ డాక్టర్ పట్ల ఓ రోగి ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
రాజస్థాన్ అజ్మీర్‌లోని ఒక ప్రభుత్వాసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నగరంలో జవహార్ లాల్ నెహ్రూ హాస్పిటల్‌లో ఓ వృద్ధుడిని ఓ లేడీ డాక్టర్ చితకబాదింది. వైద్యురాలు తన స్నేహితురాలితో కలిసి గేట్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన వృద్ధుడి ఆమెను తాకరాని చోట తాకాడు. వీడియోలో అయితే అతడి భుజం తాకినట్లు అస్పష్టంగా కనిపిస్తోంది. అయితే కావాలనే తాకాడని ముసలోడు అని చూడకుండా ఆ లేడీ డాక్టర్ అతడిని చితకబాదింది. ఆ వ్యక్తి ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా రెచ్చిపోయింది. అతడు క్షమాపణ చెప్పినా వెనక్కి తగ్గలేదు.
దీనిపై ఆమెను ప్రశ్నించగా అతడు తన ప్రైవేట్ పార్ట్ ను తాకాడని చెప్పింది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. దీనిపై పోలీసుల విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆస్పత్రిలోని సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. అతడు అనుకోకుండా తాకాడా లేదా కావాలనే చేశాడా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఈ మధ్య కాలంలో ఆస్పత్రికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. డాక్టర్లు రోగులకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని, ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని, రోగులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారనే వార్తలు వింటూనే ఉన్నాం. మరోవైపు డాక్టర్లు కూడా మానభంగానికి గురవుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
Also Read: Viral Video – ఛీ..ఛీ..క్లాస్ రూమ్ లో ఇదేం పాడు పని.. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన ప్రేమ జంట..


